వాకాడు, నెల్లిపూడి గ్రామాలలోని సంపద తయారీ కేంద్రాలను ప్రత్యేక అధికారి శ్రీనివాస రావు పరిశీలించారు.. వెల్నెస్ సెంటర్, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు.. పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.. సిబ్బందికి సూచనలిచ్చారు..అనంతరం ఆయన మాట్లాడుతూ..చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేసేలా అధికారులకు సూచించామన్నారు.
తడి, పొడి చెత్తల నుండి వరి కంపోస్టు తయారు చేయు నిమిత్తం షెడ్డుకు తరలించి పారిశుధ్య కార్మికుల చేత చెత్త సేకరించి గ్రామాలలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఎంతో ఉపయోగకరమన్నారు..ఆయన వెంట ఎంపీడీఓ గోపినాథ్, ఈఓపీఆర్డీ తదితరులు ఉన్నారు.
Post a Comment