నాయుడుపేటలో మొదటిసారి శ్రీ జగన్నాథ రథ యాత్ర ఇస్కాన్ ఆధ్వర్యంలో
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఇస్కాన్ టెంపుల్ వారి, ఆధ్వర్యంలో, శ్రీ జగన్నాథ రథయాత్ర, జూలై 2వ తేదీన, పిచ్చిరెడ్డి తోపు లోని, శ్రీ విజయ గణపతి దేవస్థానం నుండి, రథ యాత్ర మార్గం బయలుదేరి, గాంధీ పార్క్ మీదగా, బ్రాహ్మణ వీధి, బజార్ వీధి, కూరగాయల మార్కెట్ వీధి, ఎల్ ఐ సి ఆర్టీసీ, క్లాక్ టవర్, గాంధీ పార్క్ మీదుగా తిమ్మాజి కండ్రిగ ఇస్కాన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు రథయాత్ర చేరును, ఈ జగన్నాథ రథయాత్ర నాయుడుపేటలో తొలిసారిగా జరుపబడును అని, ఇస్కాన్ సుఖదేవ్ నంద స్వామి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి ఆధ్వర్యంలో తెలియజేశారు, ఈ కార్యక్రమం నాయుడుపేటలో అత్యంత వైభవంగా, మంగళ వాయిద్యాలు, రంగవల్లులు, పండరి, చెక్క భజనలు, మరెన్నో కోలాహల సాంస్కృతిక బృందాల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని, ఆయన అన్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామిరెడ్డి రాజారెడ్డి గారు విలేకరులతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించాలని, నాయుడుపేట మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ శ్రీ జగన్నాథ రథ యాత్ర ను,ప్రతి ఒక్కరు దర్శించి, ఆ జగన్నాధుని కృపాకటాక్షాలు పొందగలరని కోరారు కేవలం దర్శనభాగ్యం తోనే, మన అన్ని ఇహపరకోరికలను అనుగ్రహించే శ్రీ జగన్నాధుడు కులమత బేధాలు లేకుండా యావత్ జీవ కోటిని
అనుగ్రహించడానికే మన నాయుడుపేట పట్టణ పుర వీధుల్లో కి వస్తున్నారని ఆయన తెలియజేశారు, అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా, కామిరెడ్డి రాజారెడ్డి గారు కోరారు,
Post a Comment