ఘనంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు గూడూరు లో భారీ ర్యాలీ-గజమాలతో ఘన సత్కారం ర్యాలీలో పూల వర్షంతో పాశం కు ఘన స్వాగతం పూల అలంకారంతో పాశం కటౌట్లు ఏర్పాటు 54 కేజీ ల కేక్ కట్ చేసిన పాశం సునీల్ కుమార్ పాశం జన్మదిన సందర్భంగా భారీ రక్త దాన శిబిరం పాశం జన్మదిన సందర్భంగా భారీ అన్నదానం పాశం జన్మదినానికి భారీగా తరలివచ్చిన టిడిపి నేతలు,కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు గూడూరు లో కిక్కరించిన జన సమూహం బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నఅభిమానులు పాశం కు అభినందనలు వెల్లువ జన్మదిన వేడుకలకు 3 వేల మందికి పైగా హాజరు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రజల రుణం తీర్చుకుంటా:మాజీ ఎమ్మెల్యే పాశం
గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ పాశం సునీల్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు గూడూరు నియోజకవర్గ పరిధిలో ఊరూరా నిర్వహించారు. పాశం సునీల్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు,ప్రముఖులు శుక్రవారం గూడూరు పట్టణం మరియు పలు గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాల చేపట్టారు. విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న పాశం సునీల్ కుమార్ ఎమ్మెల్యే గా నాలుగు కాలంలోనే 2 వేల కోట్ల రూపాయాలతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.
శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ 54 వ జన్మదినాన్ని పురస్కరించుకుని గూడూరు నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండాలల్లో పాశం సునీల్ కుమార్ ఫ్లెక్సీలు పోటాపోటీగా ఏర్పాటు చేసి తమ అభిమానని చాటారు.ఈ నేపథ్యంలోనే గూడూరు పట్టణంలో టిడిపి నేతలు,కార్యకర్తలు ,అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటూ చేశారు.అది కూడా కొన్ని చోట పులాతో పాశం కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానం చాటారు.ముందుగా పాశం సునిల్ కుమార్ అశోక్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ గమళ్ల పాళెం లోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ ర్యాలీ పాత నిమ్మకాయల కొట్టు వద్దకు చేరుకోవడం అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించి బాణ సంచా కాల్చి, భారీ గజమాలను క్రేన్ తో పాశం కు వేసి తమ అభిమాని చాటారు. అనంతరం టిడిపి కార్యలయంలో 54 వ జన్మదినం కేక్ ను ఏర్పటు చేయడంతో పాశం సునిల్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంచి పెట్టారు.అనంతరం భారీ గా తరలివచ్చిన అభిమానులు, టిడిపి నేతలు,కార్యకర్తలు ,ప్రముఖులు శాలువాలు కప్పి పూల మాలలు వేయడం ,పుష్ప గుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ముఖ్యంగా సోదరీమణుల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. తాను గూడూరులోఒక సామాన్య కుటుంబంలో పుట్టి విద్యార్థి స్థాయి నుంచి రాజకీయాల్లో రాణించి చిన్నతనంలోనే విద్యార్థి నేతగా, మున్సిపల్ చైర్మన్ గా, నియోజకవర్గ శాసనసభ్యులు బాధ్యతలు చేపట్టడం వెనుక ప్రజల ఆశీస్సులు, కుటుంబం సభ్యులు దీవెనలు ఉన్నాయి అనీ చెప్పారు.
అదేవిధంగా ప్రజల ఆశీస్సుల వల్ల రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో గుర్తింపు వచ్చిందన్నారు. అలా గుర్తింపు రావడానికి నా గూడూరు ప్రజలు చేసిన కృషి శ్రమ ఫలితమే అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలందరికీసేవచేయలేకపోయానని మరో అవకాశం ఇస్తే గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోనడిపిస్తానని, ప్రజలందరూ తీర్చుకుంటానని బహిరంగంగా వెల్లడించారు.అనంతరం టిడిపి మాజీ కౌన్సలర్ ,పట్టణ టీడీపీ నాయకులు వాటం బేడు శివ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పాత బస్టాండ్ లో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేదలకు మంచి ఆహారం అందించారు.
జన్మదిన వేడుకల్లో పట్టణ టీడీపీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, టిడిపి నేతలు బిల్లు చెంచురామయ్య, నట శేఖర్, మట్టం శ్రావణి, గుండాల భారతి,గుండాల లీలావతి, రాజేష్ , శివ ప్రసాద్ గౌడ్, మాముడూరు హరికృష్ణ,గూడూరు మండలం నాయకులు దాము యాదవ్, అమరేంద్ర యాదవ్, శంకర్ రెడ్డి,
టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వరరాజు, వెంకటేశ్వర్లరెడ్డి,సర్వోత్తమరెడ్డి,దువ్వూరు మధుసూదన్ రెడ్డి,గణపర్తి కిషోర్ నాయుడు, తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, టిడిపి సీనియర్ నేతలు పలగాటి భాస్కర్ రెడ్డి,నెల్లూరు మోహన్ రెడ్డి, పాదర్తి కోటా రెడ్డి,మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మర్రి పొలయ్య, భాస్కర్,రామయ్య,తదితరులు పాల్గున్నారు.
Post a Comment