అమ్మవారి భూముల నిర్మాణ పనులను పరిశీలించిన ఆలయ చైర్మన్ బాలచంద్ర రెడ్డి, మునిసిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి.
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట :- శ్రీ శ్రీ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆస్తులు సంబంధించి వాటంబేడు వెళ్ళు దారి ప్రక్కనే ఉన్న నెర్రి కాలువకు,సూళ్లూరు చెరువుకు పక్కన ఆనుకుని సుమారు 5ఎకరాలు భూమిని 1915సంవత్సరంలో కొంత మంది రైతుల చేతులోకివెళ్ళిపోయింది. 5ఎకరాలు భూమికి సంబందించిన సూళ్లూరు వారసులు 27మంది పేర్ల మీద ఈ భూములు ఉన్నట్టుగా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి గుర్తించారు. అయితే అభూములు వారికి ఉన్నట్టు కూడ వారికే తెలియదని, విషయం వివరించగా ఆ భూములను అమ్మవారికి తిరిగి ఇవ్వవలిసిందిగా ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి కోరాగా
27 మంది రైతులకు చెందిన జాయింట్ పట్ట భూమిని అమ్మవారికి తిరిగి రాసి ఇచ్చారని చైర్మన్ తెలిపారు.
ఈ భూమిని ఆలయ అవసరాలకు అనుగుణంగా భవిషత్
లో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, ఇక్కడ చదును చేయడానికి
కొన్నిగ్రామాలకు చెందిన వారు స్వచ్చందంగా ట్రాక్టర్ల తో మట్టిని తోలిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి,ట్రస్ట్ సభ్యుడు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి,కౌన్సిలర్ శరత్ గౌడ్,భాస్కర్ రెడ్డి , మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Post a Comment