వి ఎస్ యూ యాంటి ర్యాగింగ్ పై అవగాహన సదస్సు
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల అధ్వర్యంలో 20.05.22వ తేదిన కళాశాల విద్యార్ధులకు యాంటి ర్యాగింగ్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు
జాయింట్ కలెక్టర్ యంఎన్.హరింద్ర ప్రసాద్ గారు హాజరైనారు విద్యార్ధులు చిన్నప్పటి నుండే అనలిటికల్ స్కిల్ అభివృద్ధిచేసుకోవాలని, ప్రణాళిక బద్ధంగా చదవడం వలన విద్యార్ధులు నిర్దేశించుకొన్న లక్ష్యాలను సాధించాగలరని తెలియచేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులు అడిగిన పలు సందేహాలను జాయింట్ కలెక్టర్ నివృత్తి చేశారు. జాయింట్ కలెక్టర్ తన విద్యార్ధి దశ అనుభవాలను విద్యార్ధులతో పంచుకొన్నారు. విశిష్ట అతిధి డా బిందు మీనన్ మాట్లాడుతూ స్వల్పకాలిక అనందం కోసం సీనియర్ విద్యార్ధులు చేసే ర్యాగింగ్ వలన జూనియర్ విద్యార్ధుల ఆత్మస్థైర్యం దేబ్బతింటుందని, భవిష్యత్తులో ఇది ఇతర మనసిక రుగ్మతులకు దారి తీస్తుందని సోదాహరణంగా విరించారు. రిజిస్ట్రార్ డా ఎల్.విజయ క్రిష్ణ రెడ్డి గారు, మాట్లాడతూ విద్యార్ధులు క్రమ శిక్షణతో మెలగాలని తెలిపారు. విద్యార్ధులకు కావలసిన సౌకర్యాలు కల్పిచడంలో విశ్వవిద్యాలయ అధికారులు తమవంతు కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమనికి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య విజయానంద్ బాబు అధ్యక్షత వహించారు కార్యక్రమ కన్వీనర్ డా యం. హనుమరెడ్డి, యాంటి ర్యాగింగ్ కమిటీ సభ్యులు డా పి.సుబ్బరామరాజు,డా వై.విజయ,డా మేరిసందిప డా యం.త్యాగరాజు,డా శ్రీకన్యరావు,మరియు కె.సునీత భోధన మరియు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post a Comment