వీధి వ్యాపారుల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన మునిసిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్.
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట:-
పేట మునిసిపాలిటి పరిధిలోని వీధి వ్యాపారుల కమిటీ సభ్యులతో సమావేశం ను మునిసిపల్ కమీషనర్ నాగిశెట్టి నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వీధి వ్యాపారులు తమ సమస్యలను కమిషనర్ కు తెలియజేస్తూ పట్టణంలో ఇంకా కొంతమంది వీధి వ్యాపారస్తులను జాబితాలో చేర్చాలని కోరారు. అందుకు కమీషనర్ మాట్లాడుతూ వారి పేర్లు ఇస్తే సర్వే జరిపి వారికి ID కార్డులను ఇచ్చి మరియు వారికి PM స్వనిధి/జగనన్న తోడు పథకాల క్రింద MEPMA ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.
ఈ సమావేశానిక ముఖ్య అతిథిగా విచ్చేసిన APGB మెయిన్ మేనేజర్ శ్రీమతి స్వాతి మాట్లాడుతూ నిజమైన వీధి వ్యాపారులు కు ఖచ్చితంగా ఆర్థిక సహాయం అందచేస్తామని తెలియ చేశారు. ఈ సమావేశం లో MEPMA సిటీ మిషన్ మేనేజర్ పెంచలయ్య, CO లు నారాయణమ్మ, హానుమాయి, పట్టణ సమాఖ్య అధ్యక్షులు స్వప్న, కార్యదర్శి రమణమ్మ, TLF RP విభ, MECC సుప్రియ, AITUC సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.