నేడు కోటమ్మ తల్లి ఆలయంలో ఉదయం 8 గం"ల నుండి 12 గం"వరకు శ్రీమహా చండి యాగం సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సహా కార్యదర్శి కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో శ్రీమహా చండి యాగం సాయంత్రం 6 గం"ల నుండి 7 గం"లకు పుష్పయాగం రాత్రి 7 గం"ల నుండి 9 గం"ల వరకు నెల్లూరు నజీర్ బాష గారిచే భగవద్గిత ప్రవచనాలు మహా చండి యాగంలోపాల్గున్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న,నల్లపరెడ్డి కుటుంబం .లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం చండి యాగం భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలి:నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి
కోట గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ కోటమ్మ తల్లి గ్రామోత్సవం శుక్రవారం నుండి ప్రారంభం అయ్యాయి.శనివారం ఆలయంలో సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సహా కార్యదర్శి కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో శ్రీమహా చండి యాగం జరుగుతుంది. ఉదయం 8 గంటల 12 గంటల వరకు జరుగుతుంది.ఈ చండియాగంలో భక్తులు భారీగా పాల్గున్నాలి అనీ కోట సునీల్ కుమార్ స్వామి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ స్వామి మాట్లాడుతూ.. చండి యాగం వలన కలిగే లాభాలను ఆయన వివరించారుచండీ యాగం చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ప్రతిఒక్కరు తెలుసుకోవాలి అని కోరారు. లోకకల్యాణం కోసం, ఈ జగత్తు సృష్టికి మూలం విశేష కార్యసిద్ధికి మూల కారణమైన సాక్షాత్తు ఆ జగన్మాతనుపూజించడం తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ.ఈ అమ్మ వారిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరు తాయి అని చెప్పారు.
ఆదితత్వాన్ని నేత్ర మూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసన శ్రీవిద్య ఆది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలుగాఉంటుంది.సాధారణంగా చండీ యాగాన్ని దుష్టశక్తులను సంహ రించడానికి, శత్రువుల నుంచి రక్షణ పొందడానికి ఈ యాగాన్నినిర్వహిస్తుంటారు.ఈ చండీయాగాన్ని మూడు పద్ధతులలోఆచరిస్తారు.అవి హోమం,పూజ, పారాయణం అనే మూడు పద్ధతుల ద్వారా ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు.
అలాగే పారాయణంలో తిరిగి దశాంశ పారాయణం, దశాంశ తర్పణం ఇస్తారు.
గ్రహాలఅనుకూలత,శత్రు సంహారానికి,అనారోగ్య సమస్యలు,ధననష్టం తొలిగిపోతాయి,గ్రహాలఅనుకూలత,శత్రుసంహారానికి,అనారోగ్యసమస్యలు,ధననష్టం తొలిగిపోతాయి
సాధారణంగా చండీ హోమం అంటే ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతి పారాయణం చేసి, హోమం నిర్వహించడమే చండీ యాగం.దేశోపద్రవాలు శాంతిచడానికి,గ్రహాలఅనుకూలత,శత్రు సంహారానికి, భయభ్రాంతుకుతొలగిపోవడానికి శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాల చేత ఈ చండీ యాగంనిర్వహిస్తారు.కలియుగంలో అత్యంత శక్తివంతమైనది చండీ పారాయణం.
ఈ చండీయాగాలలో ఏకాదశ చండీ యాగం చేస్తే రాజు వశమవుతాడని , ద్వాదశ చండీయాగం చేస్తే శత్రువు నాశనం అవుతాడని మార్కండేయ పురాణం తెలియజేస్తుంది.ఇక శత చండీ యాగం చేస్తే కష్టాలు,అనారోగ్య సమస్యలు,ధననష్టం తొలిగిపోతాయి.సహస్ర చండీయాగం చేయటం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక లాభం కలగడమే కాకుండా,అనుకున్న కోరికలు నెరవేరుతాయి.10 లక్షల చండీ పారాయణం చేయడం ద్వారా మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి.చండీయాగం చేయటం ద్వారా సకల కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
ఎక్కడ చండీ యాగం నిర్వహించబడుతుందో అక్కడ దుర్భిక్షం దుఃఖం అనేది ఏర్పడదు.ఆ ప్రాంతంలో అకాల మరణాలుసంభవించవు.లోక కల్యాణం, సర్వజనుల హితంకోసంపరబ్రహ్మస్వరూపిణిఅయినఆపరమేశ్వరులను పూజించడం వల్ల మనకు శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని తెలిపారు.
Post a Comment