సిఐటియు ఆఫీసులో సిఐటియు నాయకులు కొమరం నవీన్ మ్రృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని ధైర్యాన్ని ప్రకటించారు.
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట : దొరవారి సత్రం మండలం కుప్పారెడ్డి పాళెం గ్రామానికి చెందిన కొమరం నవీన్ (29 సం" ) అపాచీలో అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన తెలిసిందే.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం మండల కార్యదర్శి కా. Ch సుధాకర రావ్ మాట్లాడుతూ స్పెషల్ ఎకనమిక జోన్స్ (సెజ)లో కార్మిక చట్టాల యధేశ్చగా ఉల్లంఘిస్తున్నారని ఈ ప్రాంతములో కార్మిక చట్టాల అమలు ఊసేలేదని, కార్మిక అధికారులు, పియఫ్, ఈయస్ఐ, సేప్టీ అధికారుల అజమాయిషీలు లేవని, వున్నా అధికారులు ఈ ప్రాంతపు రాజకీయదళారుల మధ్య దందాతో బాధితులకు న్యాయము జరగడము లేదన్నారు. ఈ అనైతిక విధానము వలన కొమరం నవీన్ లాంటి యువతీ యువకులు అర్ధౌంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, వారికుటుంబాల భవిష్యత్ అగమ్యగోచర మవుతున్నాయని, ఇలాంటివి పునరావతము కాకుండా వుడాలంటే కంపినీలో మానవ వనరులు, పని ప్రదేశములో రక్షణ తప్పక వుండాలని, కాని కంపినీ అధికారులు ఖాతరు చేయడము లేదన్నారు. ఈ కేసును పోలీసు కేసు నమోదు చేసి విచారణ జరపాలని, అలాగే సేప్టి అధికారులు ప్రలోభ లకు, ఒత్తిళ్శకు లొంగకుండా ఆక్సిడెండు వైనాన్ని విచారించి కార్మికుడి కుటుంబానికి న్యాయము చేయాలని, నష్టపరిహారము 20 లక్షలు ఏర్పాటు చేయాలని, చట్టప్రకారము పేమెంట్సుతో పాటు కుటుంబములో ఒకరికి నౌకరి ఇవ్వాలన్నారు. ఇలాంటి సంఘటనలు జరక్కుండా పని ప్రదేశములో రక్షణ, పనివత్తిడి తగ్గించాలని, అధికారులు టార్గెట్లు ఫిక్స్ చేసి కార్మికులను హింసించడము, చేయక పోతే భూతు పురణాము వల్లించడము ఆపాలని, కార్మికుల మీద ఒత్తిడి అరికట్టాలని కార్మిక రక్షణ, ఉధ్యోగ బధ్రత, వెల్ఫేర్ తదిర చట్టాలు తూచా తప్పకుండా అమలు చేయాలని ఇందుకు సిఐటియు, కార్మికులను అండగా వుండి, చైతన్యయ పరిచి కార్మిక చట్టాల అమలుకు వుద్యమము చేస్తుందని హెచ్చరించారు.
Post a Comment