శుభవార్త.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం!

 



కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రజలకు శుభవార్త చెప్పారు. పెరుగుతున్న పెట్రో భారాన్ని తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. లీటర్‌ పెట్రోలుపై రూ.8, లీటర్‌ డీజిల్‌పై రూ.6 సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నామని ప్రకటించారు.
దీంతో లీటర్‌ పెట్రోలు ధర రూ.9.5, లీటర్‌ డీజిల్‌ రూ.7 వరకు తగ్గనుంది

సామాన్యులకు పెనుభారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. తద్వారా ఇప్పుడు పెట్రోల్‌ పై లీటర్‌కు రూ. 9.5, డీజిల్‌పై రూ.7 తగ్గనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. దేశంలో చమురు కంపెనీలు మే 21న పెట్రోల్ – డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. గత ఒకటిన్నర నెలలుగా వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరిసారిగా ఈ రెండింటి ధరలను ఏప్రిల్ 6వ తేదీన పెంచారు. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకుఈ వార్త ఊరట ఇచ్చింది.

దేశ ప్రజలు గతకొంత కాలంగా పెట్రోల్‌, డీజిల్ ధరల విషయంలో అసంతృప్తితో ఉన్న విషయం కాదనలేని సత్యం. ప్రజల్లో ఈ అసంతృప్తి రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందన్న ఆలోచనతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా.. సామాన్యుడికి భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ మాత్రమైనా తగ్గడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget