నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్ కు సంబందించిన వాలంటీర్లకు ఉగాది ప్రోత్సాహక పురస్కారాలను ఫతేఖాన్ పేట లోని డొంక బడి నందు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదార్లుకు పారదర్శకంగా అందించడంలో గ్రామ, వార్డు వాలంటీర్లు కీలకమని అదే సమయంలో వారు అందిస్తున్న సేవలు ఎనలేనివి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రాతిపదికన సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్లు అందిస్తున్న సేవలు నిరుపమానం. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కోవిడ్ సమయంలో వలంటీర్లు అందించిన సేవలు ఎనలేనివని, మీ సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నగదు పురస్కారంతో అవార్డులు అందిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటైన సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచాయి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో 36వ డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతి శ్రీ, 36వ డివిజన్ అధ్యక్షులు పిండి సురేష్, 35వ డివిజన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు యాకసిరి శరత్ చంద్ర, బండి మహేష్ బాబు మరియు ఇతర వై.సీ.పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment