ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలో జూన్ 28 వరకు ఎన్నికల కోడ్
279 పోలింగ్ కేంద్రాలఏర్పాటు
ఎన్నికకు 648 బ్యాలెట్ యూనిట్స్ : జిల్లా కలెక్టర్ చక్రధర బాబు
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా
నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు
తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్
బాబు వెల్లడించారు.
గురువారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల
సమావేశంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం
దేశ వ్యాప్తంగా 3 పార్లమెంటు, 7అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికల
నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 115-
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉప ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన 25వ తేది నుండి
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం జరిగిందన్నారు
జిల్లాలో వచ్చే నెల జూన్ 28వ తేదీ వరకు అమలులో వుంటుందని కలెక్టర్
తెలిపారు.
ఎన్నికల నియమావళి కి అనుగుణంగా, కేంద్ర ఎన్నిక సంఘం ఆదేశాల మేరకు
జిల్లాలో ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు బెల్
ఇంజినీర్ల సహకారంతో అవసరమైన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి
ప్యాట్స్ సిద్దం చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 30వ తేదీన రిటర్నింగ్
అధికారిచే గజెట్ నోటిఫికేషన్ జారి చేయబడుతుందని, వచ్చే నెల జూన్ 6వ తేదీ
వరకు నామినేషన్ల స్వీకరణ, జూన్ 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, జూన్ 9వ తేదీ
వరకు నామినేషన్ల ఉప సంహరణ, జూన్ 23వ తేదీన పోలింగ్, జూన్ 26వ తేదీన ఓట్ల
లెక్కింపు వుంటుందని కలెక్టర్ తెలిపారు.
ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 2,13,330 మంది
ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందులో
1,05,924 మంది పురుష ఓటర్స్, 1,07,733 మంది మహిళా ఓటర్స్, 11 మంది థర్డ్
జండర్స్ ఓటర్స్ , 62 మంది సర్వీసు ఓటర్స్ వున్నారని కలెక్టర్ వివరించారు.
ఓటర్లలో 80 సంవత్సరాల పైబడి వయస్సు గల 4,981 మంది వున్నారని, అలాగే విభిన్న
ప్రతిభావంతులు 4,777 మంది వున్నారని, వీరు సజావుగా తమ ఓటు హక్కును
వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు
చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
నియోజక వర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 1,000
ఓట్లు పైబడి ఓట్లు కలిగిన పోలింగ్ కేంద్రాల పరిధిలో అదనంగా పోలింగ్
కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. 2022,జనవరి 1వ
తేదీని ప్రామాణికంగా తీసుకొని ఓటర్ల జాబితాను సిద్దం చేయడం జరిగిందని, ఈ
ఓటర్ల జాబితాను అభ్యర్దులకు, పోలింగ్ ఏజెంట్స్ కు ఇవ్వడం జరుగుతుందని
కలెక్టర్ వివరించారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి 648 బ్యాలెట్ యూనిట్స్ ను,
593 కంట్రోల్ యూనిట్స్ ను, 583 వివి ప్యాట్స్ ను వినియోగించడం జరుగుతుందని
కలెక్టర్ వివరించారు.
నియోజక వర్గ పరిధిలో ఏ ఓటర్ ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలో తెలిసేలా
ఓటర్ల స్లిప్ లను ఓటర్లకు అందచేయడం జరుగుతుందని, అలాగే ఇప్పటికే ఎపిక్
కార్డును ఓటర్స్ కు జారి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఓటర్ ఎఫిక్
కార్డు తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీసు పాస్ బుక్, డ్రైవింగ్
లెసెన్స్, పాన్ కార్డు, ఎన్.ఆర్.ఈ. జి.ఏ కార్డు, పాస్ పోర్టు వంటి 12 రకాల
గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేయుటకు ఎన్నికల సంఘం గుర్తించడం
జరిగిందని కలెక్టర్ వివరించారు.
ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా
జాయింట్ కలెక్టర్ వుంటారని, జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా డి.ఎం.హెచ్.ఓ
వుంటారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికల
ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు అవసరమైన కమిటీలను ఏర్పాటు
చేయడం తో పాటు అవసరమైన పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందని కలెక్టర్
తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు, అభ్యర్ధులకు
అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కలెక్టర్
తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరెందిరా ప్రసాద్, అడిషనల్ ఎస్.పి. హిమావతి,
జిల్లా రెవిన్యూ అధికారిణి వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి
సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు