సూళ్లూరుపేటలో నూతనంగా RDO కార్యాలయాన్ని ప్రారంభించిన నూతన RDO రోజ్ మాండ్.
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట :-
రాష్ట్రం లో జరిగిన జిల్లాల పునర్విభజన తరువాత సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి కలపడం తో ప్రజల సౌకర్యార్థం నాయుడుపేట లోని RDO కార్యాలయాన్ని సూళ్లూరుపేటకు మార్చడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక రైతు సేవ సహకార సంఘం కార్యాలయం మిద్దె పైన నూతనంగా ఏర్పాటు చేసిన RDO కార్యాలయాన్ని నూతన RDO రోజ్ మాండ్ చేతులు మీదుగా సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ సమయం లో అధికారులు సర్వమత ప్రార్ధనలు చేయించారు. అనంతరం కార్యాలయం లో పూజలు చేసిన తరువాత RDO రోజ్ మాండ్ తన ఛాంబర్ లో కూర్చుని సూళ్లూరుపేట మొదటి RDO గా ఫైల్ మీద సంతకం చేసి పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భముగా వైఎస్సార్ సిపి పార్టీ నేతలు, అధికారులు,స్థానిక ప్రముఖులు RDO ను కలిసి శాలువాలు కప్పి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భముగా RDO రోజ్ మాండ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్షంగా పనిచేస్తామని,అందుకు ప్రత్తిఒక్కరి సహాయ సహకారాలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి , మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ,పట్టణ వైసీపీ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి,మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్లు చిన్ని సత్యనారాయణ , పోలూరు పద్మ,కౌన్సిలర్లు మిజురు రామకృష్ణ రెడ్డి,పముజుల విజయలక్ష్మి,బోడెలు శరత్ గౌడ్ ,ఉట్టి మునింద్రబాబు ,పొన్న ముని ప్రసాద్ తో పాటు వైసీపీ నేతలు జెట్టి వేణుయాదవ్, వాయిలురు రాజా ,గోగులు తిరుపాలు,తుపాకుల ప్రసాద్ ,సత్యవేడు ఎంపీపీ ప్రతిమా సునీల్ కుమార్ రెడ్డి, నాయుడుపేట ఎంపీపీ ధనలక్ష్మి సూళ్లూరుపేట MRO రవికుమార్ మరియు పెళ్లకూరు తహసీల్దార్ కట్టారి జయజయ రావు, దొరవారిసత్రం డిప్యూటీ తహసీల్దార్ పి గోపిరెడ్డి, నాయుడుపేట, తడ, సత్యవేడు, వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ రెవెన్యూశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post a Comment