గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ అయ్యంగారి సేవలు చిరస్మరణీయం


 

గణిత శాస్త్రవేత్త  శ్రీ  శ్రీనివాస రామానుజన్ అయ్యంగారి సేవలు చిరస్మరణీయం

సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి

ఏప్రిల్ 26  ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త  శ్రీ శ్రీనివాస రామానుజన్ అయ్యంగారి వర్థంతి  సందర్బంగా

డోన్ పట్టణంలో యన్ యన్ కాలనీలోని యం పి పి యస్  స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో  స్కూల్ ఇంచార్జ్ హెచ్ యం యస్. అబ్దల్ రహీమ్, కె. కాశీ రామేశ్వరి అద్యక్షతన శ్రీ  శ్రీనివాస రామానుజన్ గారి వర్థంతి  సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు.  వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాద్యాయురాలు  కె. కాశీ రామేశ్వరి,  విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా స్కూల్ ఇంచార్జ్ హెచ్ యం యస్. అబ్దల్ రహీమ్, కె. కాశీ రామేశ్వరి, సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి లు మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి  కోరారు
శ్రీ శ్రీనివాస రామానుజం గారు డిసెంబర్ 22, 1887
జన్మించారు. భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. ఇతడికి పది సంవత్సరాలవయసులోనే గణితశాస్త్రంతో
అనుభందం ఏర్పడింది. చిన్న వయసులోనే గణితం పట్ల  ప్రతిభ కనపరిచేవాడు. ఆ వయసులోనే ఎస్ ఎల్ లోనీ త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను వంటపట్టించుకున్నాడు. పదమూడు సంవత్సరాలు నిండే సరికల్లా ఆ పుస్తకాన్ని ఔపోసన పట్టడమే కాకుండా తన సొంతంగా సిద్ధాంతాలు కూడా రూపొందించడం ప్రారంభించారు. భారత ప్రభుత్వం  సంఖ్యా శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. అలాగే రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. శ్రీ శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ ఏప్రిల్ 26, 1920 స్వర్గస్తులైనారు. ఇలాంటి మహానుభావులను ఎల్లవేళల  స్మరించుకుంటు వారి అడుగుజాడలలో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి, స్కూల్ ఇంచార్జ్ హెచ్ యం యస్. అబ్దల్ రహీమ్ కోరారు.
అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి విద్యార్థులకు  ఆరోగ్యం పై  అవగాహణ కలిపించారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ,తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని ,నీళ్ళు శరీరాని తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని  తెలిపారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget