"మనుబోలు మండలంలోని వాలంటీర్ల సమావేశం"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలంలోని గ్రామ వాలంటీర్లు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విలేకరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలియజేశారు.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరులో కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగేలా కృషి చేసిన మన ఎమ్మెల్యే గోవర్ధనన్నకు కృతజ్ఞతలు. తిరుపతి పార్లమెంటులో ఉన్న సర్వేపల్లి నియోజకవర్గాన్ని జిల్లాల పునర్విభజనలో నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడం జగనన్న మంచి మనసుకు నిదర్శనం. వై.యస్.ఆర్.పెన్షన్ కానుక ద్వారా ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే మా వాలంటీర్ల ద్వారా అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ కార్యక్రమాలు అందించే భాగ్యం కలిగించడం జగనన్న వాలంటీర్లకు ఇచ్చిన వరం. సర్వేపల్లి నియోజకవర్గంలో పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా గోవర్ధనన్న కృషి చేస్తుండడం ఆయనకు ప్రజలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, ప్రతి సమస్యను పరిష్కరించగలిగే తత్వం, దూరదృష్టి కలిగిన వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా దొరకడం మా అదృష్టం. ప్రజల సమస్యలపై ప్రతినిత్యం సమీక్షిస్తూ, ఉన్నత అధికారులతో మాట్లాడి, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి న్యాయం చేయడం గోవర్ధనన్నకే సాధ్యం. జిల్లాల పునర్విభజనలో అడగకముందే సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగేలా జగనన్నను ఒప్పించిన గోవర్ధనన్న కృషి సర్వేపల్లి ప్రజలు ఎన్నటికీ మరువరు. సర్వేపల్లి నియోజకవర్గం, బాలాజీ జిల్లాలో కలిసుంటే నిరుపేద కుటుంబాలు అనేక సంక్షేమ కార్యక్రమాలకు దూరమయ్యేవారు.
సర్వేపల్లి ప్రజలు పక్కనే ఉన్నా నెల్లూరు జిల్లాను విడిచి, బాలాజీ జిల్లా కేంద్రానికి వెళ్లి తమ పనులు చేసుకోలేక, ఖర్చులు భరించలేక నానా అవస్థలు పడేవారు. విద్య, వైద్య పరంగా నెల్లూరు జిల్లాపై ఆధారపడిన సర్వేపల్లి ప్రజలు బాలాజీ జిల్లాపై ఆధారపడవలసి వచ్చేది. మా ఇంటి బిడ్డగా నియోజకవర్గ ప్రజల కోసం అలుపెరగక శ్రమించే, గోవర్ధనన్న మా వాలంటీర్ల పట్ల చూపించే ప్రేమ, వెలకట్టలేనిది. సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన మా జగనన్నకు, కృషి చేసిన మన ఇంటిబిడ్డ గోవర్ధనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు..
"జై జగనన్న.. జై గోవర్ధనన్న"..
Post a Comment