తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు.
తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని అందుకే కావలి పాతవూరులోని శ్రీచైతన్య పాఠశాలలో సోమవారం తల్లిదండ్రులకు పాదపూజ "ఫ్యామిలీ పెస్ట్" కార్యక్రమం ఘణంగా నిర్వహించినట్లు శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎజిఎం కొండారెడ్డి, పాఠశాల ప్రిన్సిఫల్స్ శైలేష్ కుమార్, అమర్నాధ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల గొప్పతనం, కుటుంబ విలువలు తెలియజేసేందుకే ఈ కార్యాక్రమం నిర్వహించామన్నారు. తల్లిదండ్రులే పిల్లలకు ప్రత్యక్ష దైవాలని వారి బాల్యం నుంచే మంచి అలవాట్లకు దగ్గరగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కుటుంబంలో పెద్దలను ఎలా గౌరవించాలో తెలుపుతూ సంస్కారవంతమైన బాషను ,మన సంస్కృతి ,సాంప్రదాయాలను నేర్పించే ఆది గురువులన్నారు. అనంతరం వేద మంత్రాల మద్య పిల్లలు తమ తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో పాదపూజ నిర్వహించారు. అనంతరం పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ శ్రీనువాసులు, ఉపాద్యాయులు,పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Post a Comment