పైలాన్ దోషులను శిక్షించాలని ఉపరాష్ట్రపతిని కలవనున్న అఖిలపక్ష నేతలు..
ఏఎస్పీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి..
కావలి పట్టణంలో పైలాన్ ను ద్వసం చేసి రెండు సంవత్సరాలు దాటుతున్నా దోషులను ఇంతవరకు పట్టుకుని శిక్షించకపోవటం పోలీసుల భాద్యత రాహిత్యం అని దీనిపై రేపు జిల్లాకు విచ్చేయిచున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కు పిర్యాదు చేస్తామని అలానే పైలాన్ దోషులను కాపాడుతున్న ఏఎస్పీ ప్రసాద్ పైన కూడా పిర్యాదు చేస్తామని కావలి అఖిలపక్ష నేతలు తెలిపారు. సోమవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు అఖిలపక్ష నేతలు దామా అంకయ్య ( సి.పి.ఐ )పసుపులేటి పెంచలయ్య (సి.పి.యం)జ్యోతి బాబురావు(టీడీపీ)కరవది బాస్కర్( న్యూ డెమక్రసీ)డేగా సత్యం (సి.పి.ఐ) మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కావలిలో మున్సిపాలిటీ అమృత్ పధకం క్రింద గతంలో క్రేంద్రలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమృత్ పధకం పైలాన్ ను ద్వసం చేయనున్నట్లు వస్తున్న ప్రచారంలో అనుమానంతో ముందుగానే అప్పటి మున్సిపల్ కమిషనర్ అప్పటి సబ్ కలెక్టర్ శ్రీధర్ కు పిర్యాదు చేయటం కూడా జరిగిందన్నారు. అయితే ఆ పైలాన్ ను కాపాడాల్సిన రెవిన్యూ అధికారులు, పోలీస్ అధికారులు మిన్నకుండటమే కాకుండా సీసీ కెమెరాల సైతం ఆప్ చేయటం జరిగిందన్నారు. అలానే పైలాన్ ద్వసం చేసిన తరువాత భూమి పూజ పేరుతో కావలి రెవెన్యూ అధికారుల పోటోలతో పాటు పోలీస్ అధికారుల పోటోలతో ప్లెక్సీ ఏర్పాటు చేయటం వేనుక ఎవరి హస్తం ఉందో తెలియాలన్నారు. పైలాన్ ద్వసం చేస్తారని ముందొస్తుగా తెలిసినా దానిని ఆపకపోగా దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలానే పైలాన్ ద్వసం పైన కేసు పెట్టినా ఇంతవరకు దోషులను పట్టుకోవటంలో కానీ ,కేసు విచారణ లో ఉందో లేదో కూడా తెలియటం లేదన్నారు.అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏఎస్పీ ప్రసాద్ కావలి పట్టణంలో ఏ కేసులో నైనా బాధిత వ్యక్తులకు న్యాయం చేయకపోగా ఎవరైతే బాధించారో వారికే న్యాయం చేయటం జరుగుతుందన్నారు. ఉదాహరణకు ముసునూరులో దళిత బాధితుల దగ్గర నుంచి, ఎన్టీఆర్ విగ్రహం కానీ, పైలాన్ కానీ ,రామంజపురం ఘటన కానీ ఇలా ఎన్నో కేసులలో న్యాయం చేయకపోగా అవతలి వ్యక్తులకు అండగా నిలబడిన సంఘటనలు ఉన్నాయన్నారు.దీంతో భాధితులు పోలీస్ స్టేషన్ కు వెల్లాలంటే భయాందోళనకు గురవుతున్నారన్నారు. అలానే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం లో ఉన్నా పైలాన్ దోషుల పై చర్యలు తీసుకోవాలని పోలీసులు ,రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తేకపోగా బిజెపి అగ్రనేతల దగ్గరకు తీసుకోపోవటంలో కావలి బిజెపి నేతలు విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా పైలాన్ దోషులను పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏ ఎస్పీ ప్రసాద్ పై చర్యలు తీసుకొని అతనిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు..
Post a Comment