భారీ వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు ఏమైనా పరిహారం ఇచ్చారా
కరువు జిల్లాలలో ప్రత్యాన్మాయ పంటలు ప్రోత్సహించండి
పార్లమెంట్లో గళమెత్తిన తిరుపతి ఎంపీ గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎనిమిది లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, సుమారు రూ. 3,000 కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని, కేంద్ర ప్రభుత్వానికి తెలుసా, తెలిసినట్లయితే రాష్ట్రానికి ఏదైనా పరిహారం మరియు ఆర్థిక సహాయం అందించబడిందా అలా అయితే దాని వివరాలు మరియు కాకపోతే, కారణాలు తెలుపగలరని అలాగే దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా సహాయపడే పంటల విధానాలను మార్చడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అని తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర వ్యవసాయ శాఖామాత్యులు సమాధానంగా శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ బదులిస్తూ విపత్తు నిర్వహణలో ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంచబడిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుండి గుర్తించబడిన ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో నష్టాల అంచనాను చేపట్టి ఆర్థిక సహాయాన్ని అందిస్తాయని. తీవ్రమైన ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఏర్పాటు చేసిన విధానం ప్రకారం అదనపు ఆర్థిక సహాయం అంతర్-మంత్రిత్వ కేంద్ర బృందం (ఐఎంసిటి) ద్వారా ప్రభావిత ప్రాంతాల సందర్శనతో సహా, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్/ఎన్డీఆర్ఎఫ్ కింద సహాయం ఉపశమనం రూపంలో అందించబడుతుందని తెలియజేసారు. 2021లో రాష్ట్రంలో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన నష్టాల కోసం ఎన్డీఆర్ఎఫ్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1080.71 కోట్ల (వ్యవసాయ ఇన్‌పుట్ సబ్సిడీకి రూ.555.19 కోట్లతో సహా) అదనపు ఆర్థిక సహాయాన్ని కోరిందని. ఐఎంసిటి నివేదిక ఆధారంగా మరియు సబ్-కమిటీ ఆఫ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క సిఫార్సుల ప్రకారం, రూ.351.43 కోట్ల (వ్యవసాయ ఇన్‌పుట్ సబ్సిడీకి రూ. 201.90 కోట్లతో సహా) ఆర్థిక సహాయాన్ని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించిందని, మారుతున్న వాతావరణంలో దేశీయ ఆహార ఉత్పత్తిని కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కోవడానికి, వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఫ్లాగ్‌షిప్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ 'నేషనల్ ఇన్నోవేషన్స్‌ను ప్రారంభించిందని. కరువులు, వరదలు, మొదలైన విపరీత వాతావరణ పరిస్థితులకు గురయ్యే జిల్లాలు మరియు ప్రాంతాలలో వాతావరణాన్ని తట్టుకునే సాంకేతికతలను అభివృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని, సహజ ప్రమాదాలు/విపత్తులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు & వ్యాధులు మొదలైన వాటి కారణంగా పంట దిగుబడి నష్టాలకు ఆర్థిక మద్దతు కోసం పంటల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేసారు, అలాగే ఇంకా, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ నీటి ఆధారిత వరి పంటల ప్రాంతాన్ని ప్రత్యామ్నాయ పంటలకు మళ్లించడానికి 2013-14 నుండి అసలైన హరిత విప్లవ రాష్ట్రాలలో అంటే హర్యానా, పంజాబ్ & ఉత్తర ప్రదేశ్ (పశ్చిమ భాగం)లో పంటల వైవిధ్యీకరణ కార్యక్రమాన్ని (CDP) అమలు చేస్తోంది. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ముతక తృణధాన్యాలు, న్యూట్రి తృణధాన్యాలు, పత్తి మొదలైనవి. ఎంపీ గురుమూర్తి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా తెలియజేసారు.
Post a Comment