సూళ్లూరుపేట శ్రీ చెంగాళ్లమ్మ అలయంలో పలు అభవృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.
తిరుపతి జిల్లా.సూళ్లూరుపేట : సూళ్లూరుపేట లో కాల్లంగి నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి
ఆలయం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను నేడు స్తానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతులు
మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగంగా ముందుగా 36 లక్షల
రూపాయలతో భక్తులు బస చేయడం కోసం నిర్మించిన 6 ఏసి గదులను ఆలయ పూజారుల తో పూజలు నిర్వహించి ప్రారంభించారు.
అందులో మొదటి గదిని ఎమ్మెల్యే ప్రారంభించగా, రెండవ గదిని ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి ప్రారంభించారు. మరో మూడు గదులను విరాలదాతల చేతులు
మీదుగా ప్రారంభించడం జరిగింది.మరో గది విరాళదాత అయిన ఆలయ ఈవో ఆళ్ళ
శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యుల తో కలిసి ప్రారంభించారు.
అనంతరం 6 లక్షల రూపాయలతో
నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటు ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భముగా విరాలదాతలకు ఆలయం లో అమ్మణ్ణి ఎదుట ప్రత్యేక
పూజలు చేయించి వారిని ఎమ్మెల్యే ,చైర్మన్ చేతులు మీదుగా సన్మానించి ఆలయ గౌరవాన్ని
అందజేశారు. ఈ కార్యక్రమం లో పట్టణ వైసీపీ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి,
ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి,మునిసిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి,ఆలయ పాలకవర్గం సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి, వంకా దినేష్ కుమార్, కర్లపూడి సురేష్ బాబు, శ్రీమతి బండి సునీత, ఓలేటి బాల సత్యనారాయణ, శ్రీమతి మన్నెముద్దు పద్మజ, నాయుడుకుప్పం నాగమణి మాజీ ధర్మకర్తలమండలి సభ్యులు గోగుల తిరుపాలు, కర్లపూడి మదన్ మోహన్, శ్రీమతి ముంగర అమరావతి, శ్రీమతి మద్దూరు శారద, శ్రీమతి కామిరెడ్డి రేవతి, తడ ఎంపీపీ రఘు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment