వాలంటీర్లకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్

 




విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో వాలంటీర్లకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి వ్యాఖ్యలు


జన్మభూమి కమిటీల పేరుతో పెత్తందారి విధానాన్ని అమలు చేసిన సంస్కృతి గత ప్రభుత్వానిది. - వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తున్న ఘనత మా ప్రభుత్వానిది.

దశాబ్దాల కిందట ఆక్రమించుకున్న స్థలాలకు మొక్కుబడిగా కాగితపు ముక్కలు ఇచ్చిన సంస్కృతి గత ప్రభుత్వానిది - ఇళ్లస్థలాలలు ఇచ్చి  పేదోళ్ల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత మా ప్రభుత్వానిది


నీరు - చెట్టు అంటూ జేబులు నింపుకునే పథకాలతో ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసిన సంస్కృతి గత ప్రభుత్వానిది. - భవన నిర్మాణాలతో శాశ్వత అభివృద్ధి పనులకు అత్యధిక నిధులు కేటాయించిన ఘనత మా ప్రభుత్వానిది.


ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు ఇచ్చి సంక్షేమం అంటూ మభ్యపెట్టిన సంస్కృతి గత ప్రభుత్వానిది.- అమ్మఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా లాంటి పథకాలతో సంక్షేమానికి సరైన నిర్వచనం చెప్పిన ఘనత మా ప్రభుత్వానిది.


వెంటిలేటర్ పై ఉన్న వారికి సైతం మెడలో పసుపు కండువాలు కప్పి సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు ఇచ్చిన సంస్కృతి గత ప్రభుత్వానిది. -  2,434 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని వారికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరు చేస్తున్న ఘనత మా ప్రభుత్వానిది.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget