కమిషన్ సమన్లు ఇచ్చిందంటే చచ్చినట్టు హాజరవ్వాల్సిందే: వాసిరెడ్డి పద్మ

 


 చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా నడిపారంటూ ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్‌ ఛైర్మన్‌పై టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగడాన్ని కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయమై చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్‌ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 27 ఉ.11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమా స్వయంగా రావాలని వాసిరెడ్డి పద్మ ఆ సమన్లలో ఆదేశించారు.

 ఈ ఘటనపై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. బోండా ఉమ మహిళా కమిషన్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. మహిళా కమిషన్ సుప్రీమా? అని బోండా ఉమా అడుగుతున్నాడు అవును, కమిషన్ నీలాంటి వారికి సుప్రీమే. మహిళలని వేధించే వారికి కమిషన్ సుప్రీమే. ఇలాంటి నేరాలు ఎవరూ చేసిన క్షమించేది లేదు. బాధితురాలితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు తెలియదని నిన్ననే అర్దమైంది. యుద్దానికి వెళ్తున్నట్టు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాగ చేస్తున్నారా?. మనసు, శరీరం గాయం అయిన యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అత్యాచార బాధితురాలితో ఎలా మాట్లాడాలో తెలియదా?. అలాంటి వారికి సమన్లు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు ఉంది. గతంలో చాలా కేసుల్లో పోలీసు అధికారులకు కూడా ఇచ్చాం. వారానికి యాభై, అరవై సమన్లు ఇస్తున్నాం.

 కోట్లాది మంది మహిళలకు నేను బాధ్యురాలిని. నా హక్కులు నాకు ఉన్నాయి. నేను రాజకీయ నాయకురాలినైతే అప్పుడు వేరేగా ఉండేది. 27న చంద్రబాబు, బోండా ఉమా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందే. లొసుగులతో బయట పడేలా ప్లాన్ చేస్తున్నారు. న్యాయవాదులతో మాట్లాడుతున్నారట. అసలు బాధితురాలి దగ్గర బల ప్రదర్శన చేయటం ఏంటి? నామీద సవాల్ చేయటం ఏంటి? ఆ ఘటనని రాజకీయం చేయడం తప్ప వారిలో సానుభూతి ఏదీ?. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కూడా అత్యాచార బాధితురాలిని పరామర్శించలేదు చంద్రబాబు.

 అలాంటి వ్యక్తి నిన్న ఆస్పత్రిలో రచ్చరచ్చ చేశారు. సమన్లు ఎందుకు ఇచ్చామో చాలా స్పష్టంగా చెప్పాము. కచ్చితంగా వారిద్దరినీ కమిషన్ ఎదుట హాజరయ్యేలా చేస్తాం. వారిష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కమిషన్ తల వంచుకోవాలా?. కమిషన్ సమన్లు ఇచ్చిందంటే చచ్చినట్టు హాజరవ్వాల్సిందే. చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని అడగాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారు. మీరా మహిళలకు న్యాయం చేసేది?. బాధితురాలి కుటుంబాన్ని సీఎం కలిసేలా కమిషన్ చూస్తుంది. అసలు ఏ అత్యాచార ఘటన దగ్గరకు చంద్రబాబు వెళ్లారు?. రిషితేశ్వరి కేసులో ఆర్నెళ్లు ఏం చేశారని లోకేష్ తన తండ్రిని అడగాలి. వనజాక్షి కేసులో ఏం చేయలేకపోయారెందుకని కూడా తన తండ్రిని అడగాలి అంటూ కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో చంద్రబాబుపై మండిపడ్డారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget