కెనడా తెలంగాణ అస్సోసియేషన్, టొరంటో లో కనుల విందుగా అంగ రంగ వైభవం గా ఉగాది ఉత్సవాలు

 







 కెనడా తెలంగాణ అస్సోసియేషన్, టొరంటో లో  కనుల విందుగా అంగ రంగ వైభవం గా ఉగాది ఉత్సవాలు
 
          తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో 2nd ఏప్రిల్ 2022 శనివారం రోజున గేృటర్ టోరంటో నగరంలోని కెనడా తెలుగు, తెలంగాణ వాసులు  ఉగాది పండుగ సాంస్కృతిక virtual ఉత్సవాలు అంగరంగ వైభవంగా  జరుపుకున్నారు.  ఈ సంబరాలలో  దాదాపు 200 పైగా తెలుగు వారు పాల్గొని  వైస్ ప్రెసిడెంట్ శ్రీ మన్నెం శ్రీనివాస్ వారి ధర్మపత్ని స్వాతి గారు దీప ప్రజ్వలన చేసి ఉగాది పండుగ 2022 ఉత్సవాలను ప్రారంభించారు.

          శ్రీ ఈద రాజేశ్వర్ ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియేషన్ మాట్లాడుతూ, కెనడా తెలంగాణ సంఘం ఆధ్వర్యములో ఉగాది పండుగ అత్యంత ఉత్సహంగా, భక్తి శ్రద్దలతో  ఘనంగా జరుపుకొంటూ, మన తెలుగు సంప్రదాయాలను, కట్టు, భొట్టు లను భావితరాలకు అందచెయ్యటం హర్షణీయము

           ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్  Executive Committee ఆధ్వర్యంలో, Board of Trustee  మరియు Foundation Committee సభ్యుల సహకారంతో జరిగాయి

          ఉగాది పండుగ ఉత్సవాల సందర్బంగా TCA వారు " పిట్స్ బర్గ్“ శ్రీ వెంకటేశ్వర ఆలయము వారిచే పూజ గావించి, మరియు ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ ధనాలకోట సురేష్ చంద్ర వర్మ (హైదరాబాద్-ఉప్పల్) వారిచే శ్రోతలకు పంచాంగ శ్రవణం చేసారు.

          ఈ సందర్బంగా ఉగాది పండుగ విశిష్టత తెలుపుటకు చిన్నారులతో ఉగాది పచ్చడి చేయు విధానము చక్కగా శ్రోతలకు వివరించగా, “గజి బిజీ బడి” విన్నూతమైన నాటకము సుమారు 20 పైగా చిన్నారులు, పెద్దవారితో ప్రదర్శించటం మరియు ట్రేండింగ్ రీల్స్, ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులందరిని ఆకర్షించాయి.

          ఈ వేడుకలో ఎన్నోవివిద సాంస్కృతిక కార్యక్రమాలతో విభిన్నరూపములో సుమారు 3 గంటల పాటు virtual సభికులని అలరించాయి. ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలుగు వారు ప్రదర్శించటం విశేషం

          ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ టెక్నికల్ టీం లో శ్రీ వెంకట జితేందర్ చక్క   గారు, కుమారి రిషిమా గజవాడ, ఈద శివాని, ఈద వైష్ణవి, మరియు తాటి సాయి రామ్ చక్కగా టెక్నికాల్ ఇబ్భంది లేకుండా ఆర్గనైజ్ చేసినారు.  వర్చ్యువల్ ఈవెంట్ ను, శ్రీ రాహుల్ బాలినేని మరియు మానస ఇనగంటి చాల ఫన్ గ, చక్కగా సమన్వయ పరిచారు.

          ఈ కార్యక్రమము లో జనరల్ సెక్రటరీ శ్రీ దామోదర్ రెడ్డి, బోర్డ్ అఫ్ ట్రస్టీ అధ్యక్షులు శ్రీ సంతోష్ గజవాడ గారు, కల్చరల్ సెక్రటరీ శ్రీమతి కవిత తిరుమలాపురం గారు, ట్రెజ్రెరర్ శ్రీ నవీన్ ఆకుల గారు మరియు కార్యవర్గసభ్యు లు, బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యు లు పాల్గొన్నారు. మరియు వ్యవస్థాపక సభ్యు లు శ్రీ శ్రీనివాస్ తిరునగరి, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల , శ్రీ విజయ్ కుమార్ తిరుమలాపురం, శ్రీ హరి రాహుల్,  శ్రీ పభ్రాకర్ కంబాలపల్లి, మరియ శ్రీ పక్రాష్ష్ చిట్యాల, లు పాల్గొన్నారు.

          ఈ కార్యక్రమము శ్రీ శ్రీనివాస్ మన్నెం గారి సందేశం  ఏ దేశమేగినా ఎందు కాలెడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము.కృతజ్ఞత వందన సమర్పణతో విజయవంతము గా ముగిసాయి.


 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget