ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి శుభవార్త చెప్పారు

 


 ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. 2022 - 23 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను చెల్లింపు పై జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా.. మున్సిపాలిటీలు, నగర పాలక, నగర పంచాయతీలలో ఆస్తి పన్ను ను.. ఈ మాసం చివరలో చెల్లిస్తే.. 5 శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి.

మొత్తం తమ ఆస్తి పన్నును ఒకే సారి చెల్లిస్తేనే.. ఈ రాయితీ వర్తిస్తుందని.. పురపాలక శాఖ ఉత్తర్వులలో పేర్కొంది. ఈ మేరకు తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని ఆయా మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే.. ఇంటి, నీటి పన్నును వసూలు చేస్తోంది. పాత బకాయిలను మార్చి.. నెలాఖరులోగా చెల్లించాలని సూచనలు చేసింది. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా.. అధికారులు పన్ను వసూలు మొదలు పెట్టారు. కొన్ని చోట్ల దీనిపై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget