మూడేళ్ల వైసీపీ పాలనలో పలు రంగాల్లోని కార్మికులు రోడ్డున పడ్డారు
కార్మికుల సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది, అవసరమైతే వారికి అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది
నెల్లూరు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు శివారెడ్డి, కిషోర్, రాజా మిత్రబృందం, కార్మిక నాయకుల అంతా కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు, మాజీ నగర మేయర్ హాజీ షేక్ అబ్దుల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారు
తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రంగాల్లోని కార్మికులు జీవన ఉపాధి కోల్పోయి నాశనం అయిపోయారు క్రషర్, రోడ్డు, భవన, బ్రిడ్జి, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ తదితర రంగాల్లోని కార్మికులకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆయా రంగాలకు వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే నేడు ఆయా రంగాల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది చివరకు ఆయా రంగాల్లో పనులు లేక కొంత మంది కార్మికులు నిరాశ్రయులుగా మారిపోయారు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వదు.. ప్రైవేటు రంగంలో డ్రైవర్లుగా పని చేసేవారికి ఉపాధి అవకాశం లేకుండా చేస్తున్నారు... ఇదెక్కడి న్యాయం
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయా రంగాలకు నిధులు మంజూరు చేసి లక్షలాది కార్మికులకు పని ( జీవన ఉపాధి ) కల్పించి తలెత్తి బ్రతికేలా చేశారు నేడు వైసీపీ ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా ఆయా రంగాల్లోని కార్మికులు బ్రతుకుతున్నారు ప్రతి ఒక కార్మికుడు టీఎన్ టీయుసీలో చేరి వారి హక్కులపై పోరాడాలి టీఎన్ టీయుసీ ( తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ )ని మరింత బలోపేతం చేసి పటిష్ట పరచాలి.
Post a Comment