జగనన్న మాట- గడపగడపకు కోటంరెడ్డి బాట కు తాత్కాలిక బ్రేక్
రోజురోజుకు తీవ్రమవుతున్న (సయాటిక ) కాలు నొప్పితో విరామం
విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన
కాలు నొప్పి వేధిస్తున్న గత రెండు రోజులుగా నిరంతరాయంగా కార్యక్రమం
రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేపట్టని విధంగా పాదయాత్రలతో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ నిరంతరం వారి వెంట ఉండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన జగనన్న మాట- గడపగడపకు కోటంరెడ్డి బాటకు శనివారం తాత్కాలిక బ్రేక్ ఏర్పడింది. నెల్లూరు గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న మాట- గడపగడపకు కోటంరెడ్డి బాట కార్యక్రమం విరామం లేకుండా ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కాలు నొప్పితో (సయాటికా) ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. కాలి సమస్య వేధిస్తున్న ఏమాత్రం లెక్కచేయకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాత్రం గత రెండు మూడు రోజులుగా ఇంటింటికీ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్, నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి తో పాటు పలువురు కోటం రెడ్డి ప్రజలతో మమేకం అవుతున్న తీరు ఆయన చేస్తున్న పాదయాత్ర లను ప్రశంసించారు. కోటంరెడ్డి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శమని కొనియాడారు
గత రెండు వారాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లో పర్యటించి అక్కడ పేద ప్రజల నివాసాల్లో వారు వండినదే తింటూ రూరల్ ఎమ్మెల్యే స్థానిక కాలనీల్లోనే బస చేస్తున్నారు.
గత మూడు నాలుగు రోజులుగా కాలి నొప్పి (సయటికా) సమస్య మరింత ఎక్కువయ్యింది. నెల్లూరు నగరానికి దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ భిన్న వాతావరణం వేరుగా ఉన్న వారి వద్దే భోజనం తిని... రూరల్ ఎమ్మెల్యే గత రెండు వారాలుగా ఎమ్మెల్యే ఉన్నారు. సయాటిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రూరల్ ఎమ్మెల్యే ను డాక్టర్లు మరోసారి పరీక్షించి పూర్తి విశ్రాంతి అవసరమని ఆయనకు మరోసారి సూచించారు. నడిచేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇక తప్పనిసరిగా జగనన్న మాట- గడపగడపకు కోటంరెడ్డి బాటకు తాత్కాలిక విరామం ప్రకటించారు.. సోమవారం నుంచి సౌత్ మోపూర్ గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యేందుకు రూరల్ ఎమ్మెల్యే అభిమానులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఆరోగ్య పరిస్థితి సహకరిస్తుందా.. సోమవారం నుంచి జగనన్న మాట - గడపగడపకు కోటంరెడ్డి బాట యధాతథంగా ప్రారంభం అవుతుందా...లేదంటే మరో వారం రోజులు పడుతుందా అన్నది డాక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది.
Post a Comment