బుచ్చిరెడ్డిపాళెం శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలపై జరిగిన సమీక్షా

 




 బుచ్చిరెడ్డిపాళెం శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని సుదీర్ఘంగా చర్చించి  బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అత్యంత వైభవంగా నిర్వహించాలని తీర్మానించిన ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ,ట్రస్టీ ఛైర్మన్ దొడ్ల మురళీకృష్ణారెడ్డి,కమీషనరు శ్రీనివాసరావు,CI-కోటేశ్వరరావు,ఎలక్ట్రికల్ AD-శీనయ్య,AE-ధనపాల్,SI-వీరప్రతాప్ పాల్గొన్న రెవెన్యూ,వైద్య,ఎలక్ట్రికల్ శాఖల అధికారులు,స్థానిక  నాయకులు-మోర్ల మురళి,మోర్ల భరత్,కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి,బెజవాడ నరేష్ చంద్రారెడ్డి,వైస.ఛైర్ పర్సన్ లలిత,కౌన్సిలర్లు సత్యం,ప్రసాద్.

ఛైర్ పర్సన్ మాట్లాడుతూ..దశాబ్దాల చరిత్ర కలిగిన మన  కోదండరామ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ ఏప్రిల్ 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఈరోజు పలు శాఖల అధికారులతో దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ దొడ్ల మురళీకృష్ణ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించాం.

కరోనా కారణంగా గత 2-సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు జరపనందున ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను పూర్తిచేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆయశాఖల అధికారులను సమావేశంలో కోరాము.

బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన స్వామి వారి రథోత్సవం,కళ్యాణం,తెప్పోత్సవం, గరుడసేవ రోజులలో భక్తులుఅత్యధిక సంఖ్యలో హాజరవుతారు.ఆరోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేసి అందుకు తగిన విధంగా ముందొస్తు చర్యలు చేపట్టాలని పోలీసు శాఖ వారిని కోరాము.

వేసవి దృష్ట్యా భక్తులకు మెడికల్ క్యాంపు, త్రాగునీరు,ఎప్పటికప్పుడుశానిటేషన్ చేసి బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాము.

బ్రహ్మోత్సవాలకి వచ్చే భక్తులు మరియు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయితీ ప్రజలు కూడా దేవస్థానం సిబ్బందికి,అధికారులకు సహకరించి బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేయాలని మనవి చేసిన ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళీ.


 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget