" తోటపల్లి గూడూరు షెడ్యూల్డ్ కులాల పత్రికా సమావేశం"
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం,తోటపల్లి గూడూరు మండలంలోని షెడ్యూల్డ్ కులాలు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కృషి చేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు.
రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రామాలతో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు, అన్ని ప్రాంతాల సమతుల్యాభివృద్ధి చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. సచివాలయాల ఏర్పాటుతో గ్రామ పొలిమేర దాటకుండానే పరిష్కరిస్తున్న జగనన్న పాలన ప్రజాసంక్షేమ పాలన. సర్వేపల్లి నియోజకవర్గంలో వ్యక్తిగత సమస్యలకు తప్ప, గ్రామ సమస్యలపై అర్జీలు ఇవ్వనంతగా ప్రతిక్షణం సమీక్షిస్తూ, గ్రామాలలోని సమస్యలను పరిష్కరిస్తున్న మా ఇంటి బిడ్డ గోవర్ధనన్న.
జగనన్న మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాలుగా పునర్విభజనలో సర్వేపల్లి బాలాజీ జిల్లాలో కలిసిపోతుందని ఆందోళన చెందాము. సర్వేపల్లి ప్రజల కష్టం తెలిసిన నాయకుడిగా, మా ఇంటి బిడ్డగా మాకు కలిగే నష్టాలను జగనన్నకు వివరించి, నెల్లూరు జిల్లాలోనే కొనసాగేలా మా గోవర్ధనన్న కృషి చేయడం మరువలేనిది. ప్రతి పధకంలోను అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తున్న జగనన్నకు ధన్యవాదాలు. నెల్లూరు జిల్లాకేంద్రానికి అలవాటు పడిన మేము, నెల్లూరు జిల్లాను విడిచి, బాలాజీ జిల్లాకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. వెళ్లవలసిన అవసరం ఉండి వెళ్లలేని స్థితిలో ఉన్నవారిని నెల్లూరు అయితే ఎవరో ఒకరు సాయం చేసేవారు . సర్వేపల్లి నియోజకవర్గంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలతో ప్రజలలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న మా ఇంటి బిడ్డ గోవర్ధనన్న. ప్రతి కష్టంలోను తాను ఉంటానంటూ, మేము అడగకముందే సర్వేపల్లి ప్రజల తరఫున మేము పడే ఇబ్బందులను జగనన్నకు వివరించి, ఒప్పించడం మాకు, మా భావితరాలకు గోవర్ధనన్న తీసుకొచ్చిన జగనన్న వరం. గోవర్ధనన్న విజ్ఞప్తిని మన్నించి, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కొనసాగించిన జగనన్నకు, కృషి చేసిన మా గోవర్ధనన్నకు జన్మజన్మలా రుణపడి ఉంటాం.
జై జగనన్న.. జై గోవర్ధనన్న..
Post a Comment