లడఖ్ లో 4.2 తీవ్రతతో భూకంపం:ప్రాణ ఆస్తి నష్టం జగరలేదు..
న్యూఢిల్లీ: ఆదివారం లడఖ్‌లో రిక్టార్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. అయితే, ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం 2:53 గంటలకు భూకంప కేంద్రం ఉత్తర అక్షాంశం 36.02 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 77.33 డిగ్రీలు 30 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు నివాసాలు, కార్యాలయాల నుంచి బయటకుర పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కూడా భూకంపం వివరాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
Post a Comment