బ్రాహ్మణులకు గెలిపించే శక్తి లేకున్నా ఓడించే శక్తి ఉంది:-
బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు గారి వెంకటరామరాజు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా. సూళ్ళూరుపేట:- పట్టణంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సమావేశం ఆదివారం స్థానిక రాఘవరెడ్డి కల్యాణమండపం లో శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సమాఖ్య అద్వర్యం లో సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భముగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామరాజు మాట్లాడుతూ బ్రాహ్మణులకు గెలిపించే శక్తి లేకున్నా ఓడించే శక్తి ఉందన్నారు, బ్రాహ్మణులకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం జరగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో BV.సుబ్బారావు, కారంచేటి మల్లికార్జున శర్మ, VV.శివ కుమార్, K.శ్రీనివాస రావు, నాగేంద్ర కుమారి, జయశ్రీ మరియు పట్టణ బ్రాహ్మణ కుటుంభ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేశారు
Post a Comment