ప్రభుత్వ భూములను కాపాడాలి, సిపిఎం పార్టీ, నాయుడుపేట,

 




 

  నెల్లూరు జిల్లా   నాయుడుపేట

ప్రభుత్వ భూములను కాపాడాలి, సిపిఎం    పార్టీ,  నాయుడుపేట,

నాయుడుపేటలో భూములకు డిమాండ్
పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములు విన్నమాల కాలవ స్వర్ణముఖి నది పోరంబోకు భూములను కబ్జా చేస్తున్నారని, సిపిఎం నేత చేపల వెంకటేశ్వర్లు ఆర్డిఓ గారికి వినతి పత్రం సమర్పించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయుడుపేట లోని భూములకు రేట్లు పెరగడంతో శివాలయం దగ్గర ఉన్న స్మశాన వాటిక సమీపంలో
ఒక చోట నేత కాలువ పోరంబోకు స్థలాలను
లక్ష రూపాయలకు అమ్మి వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు, ఇప్పటికే కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆయన తెలియజేశారు
ప్రభుత్వ భూములకు పక్కన ఉన్న
సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసి
అమ్మేస్తున్నారు అని అన్నారు,
రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు, ఈ భూములను పై అధికారులు స్వాధీనం చేసుకోకపోతే,
సిపిఎం ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు నాటి భూ పోరాటం చేస్తామని హెచ్చరించారు,
ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు శివకవి
ముకుంద, బెజవాడ వీరస్వామి, ప్రజా సంఘ నాయకులు  రమణయ్య, పుట్టయ్య,
కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget