పశ్చిమ గోదావరికి చెందిన యువతి మిస్సింగ్ కేసు… చేధించిన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తి కోసం తల్లిదండ్రులకు చెప్పకుండా నెల్లూరుజిల్లాకు విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతిని సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేట పోలీసులు. యువతి ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్ డేటా ఆధారంగా నెల్లూరుకు వెళ్లినట్లు గుర్తించిన అక్కడి పోలీసులు… విషయాన్ని నెల్లూరుజిల్లా ఎస్పీ విజయరావుకు తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన ఎస్పీ గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన సూళ్లూరుపేట పోలీసులను అప్రమత్తం చేశారు. సాంకేతకతను ఉపయోగించి యువతి సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి ఆ యువతిని సూళ్లూరుపేట ఎసై పి రవిబాబు సమక్షంలో తన సిబ్బందితో క్షేమంగా మహిళా పోలీసుల ఆధ్వర్యంలో పొలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అనంతరం ఎసై కుటుంబసభ్యులకు సమాచారం అందించి సూళ్లూరుపేట కు రప్పించారు. మంగళవారం సూళ్లూరుపేట సిఐ కార్యాలయంలో గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సూళ్లూరుపేట ఇంచార్జి సీఐ సోమయ్య ఆధ్వర్యంలో యువతిని వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సకాలంలో స్పందించి మిస్సింగ్ కేసును ఛేదించిన సులూరుపేట ఎస్సై రవిబాబు కు తన సిబ్బందికి డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి రివార్డులు అందజేశారు.
Post a Comment