సూళ్ళూరుపేట పట్టణంలో ని కోళ్ళమిట్ట లో భవన నిర్మాణ కార్మికుల సమావేశం.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
పట్టణ ప్రాంతంలోని కోళ్ళమిట్ట లో భవన నిర్మాణ కార్మికులతో సిఐటియు నాయకులు సభా సమావేశం నిర్వహించారు. ఈ సభా సమావేశం భ.ని.కా సంఘము అధ్యక్షులు గురవయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సూ.పేట భ.ని
కా. మండల గౌరవ అధ్యక్షులు కా సాంబశివయ్య మాట్లాడుతూ చట్టబద్దంగా ఏర్పడిన ఆం.ప్ర. భ.ని.కార్మికుల 2700 కోట్లఫండును ప్రభుత్వము దారిమళ్ళించడము, గౌరవ సుప్రీమ్ కోర్టు నిర్ణయాన్ని సైతం ఉల్లంఘించ
డమేనన్నారు. ఇతర రాష్ట్రాలు కార్మికుల సంక్షేమము కోసము, పెన్షను కోసము ఫండును వెచ్చిస్తున్నారన్నారు. మన రాష్ట్రములో కరోన కాలములో దిక్కుతోచని కార్మిక కుటుంబాలను ఆదుకోలేదని చివరకు ప్రసూతి, కాన్పుల తదితర బిల్లులు నెలలు గడిచినా చెల్లించలేదన్నారు. ఈ సమావేశంలో నూతన కమటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గురవయ్య, ఉపాధ్యక్షులుగా మణి మురుగేశ్, కార్యదర్శిగా రాఘవ,సంయుక్త కార్యదర్శులుగా మునుస్వామి, నాగరాజ కమిటి సభ్యులుగా శేఖర్, బాబు ను ఎన్నుకున్నారు.
Post a Comment