"వెంకటాచలం మండలంలోని మహిళల సమావేశం"
తేది:15-03-2022 నెల్లూరుతోనే సర్వేపల్లికి అనుబంధం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో విలేకరుల సమావేశంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కృషి చేసిన ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారికి తమ కృతజ్ఞతాభివందనాలు వ్యక్తం చేసిన "మహిళలు"
ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నది. సర్వేపల్లి ఆడపడుచులకు అండగా, మాకు ఎటువంటి కష్టం రానివ్వకుండా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్న మా తోబుట్టువు గోవర్ధనన్న. సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కొనసాగించిన జగనన్నకు, కృషి చేసిన గోవర్ధనన్నకు మహిళలందరి పక్షాన ధన్యవాదాలు. జిల్లాల పునర్విభజన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరుగుతాయని, సర్వేపల్లి ప్రజలు విద్యకు, వైద్యానికి బాలాజీ జిల్లా కేంద్రంపై ఆధారపడాలని వార్తలు విని, భయపడ్డాము. మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలతో పాటు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. నేడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేసి, రాజ్యాధికారం వైపు అడుగులు వేయిస్తున్నారు. 👉సర్వేపల్లిని, బాలాజీ జిల్లాలో కలిపితే, మహిళలు పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాను వదిలి, బాలాజీ జిల్లాకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. దీనితో మహిళలు అన్ని రంగాల్లో రాణించలేక, దూర ప్రయాణం చేయలేక ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి. మన "ఇంటి బిడ్డ" మనం ఎమ్మెల్యే గోవర్ధనన్న అడగకుండానే, తోబుట్టువుగా మనకు కలిగే ఇబ్బందులను జగనన్నకు వివరించి, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగేలా కృషి చేశారు.మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి మహిళకు నవరత్నాలతో ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొల్పారు. వై.యస్.ఆర్.ఆసరా, వైయస్సార్ బీమా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైయస్సార్ చేయూత, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఈబిసి నేస్తం,కాపు నేస్తం, మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిన పథకాలు. సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి మహిళకు ప్రతి పథకం అందేలా గోవర్ధనన్న కృషి చేశారు. సర్వేపల్లి మహిళలకు వీటన్నిటి కంటే పెద్ద కానుక మన సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే ఉంచడం. మా బాధల్ని అర్థం చేసుకొని మాకు వరమిచ్చిన జగనన్నా!, అనంత కోటి వందనాలు.. మా బాధలను జగనన్నకు వివరించి, ఆయనను ఒప్పించిన గోవర్ధనన్నా!, నీకు శతకోటి వందనాలు.
Post a Comment