డా.బి ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యచరచ పోటీలు నిర్వహించిన పేట దళిత నాయకులు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా.సూళ్లూరుపేట:-
పట్టణ పరిధిలోని సూళ్ళూరు కమిటీ హాలు వద్ద ఏప్రిల్14వతేదీన భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నేడు సూళ్లూరు గ్రామంలోని పిల్లలకు అంబేద్కర్ జీవిత చరిత్ర పై వ్యచరచ పోటీలు నిర్వహించారు. ఈ వ్యచరచ పోటీలు సూళ్ళూరు గ్రామానికి చెందిన పిచ్చేరి వెంకటరమణ, రాయపు చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి అంబేద్కర్ వారసులు తేరే వీరయ్య, BSNL గోపాల్,RMP డా.D రమణయ్య, జై భీమ్ అధ్యక్షుడు పిట్ల చిన్న ముఖ్యఅతిథిలుగా విచ్చేశారు. వ్యాచరచన పోటీలలో గెలుపొందిన పిల్లలకు ఏప్రిల్14వ తేదీన అంబేద్కర్ పుట్టినరోజున దాతల సహకారంతో బహుమతులు అందజేయనున్నారు. ఈకార్యక్రమంలో ప్రధానకార్యదర్శి నాయుడుకుప్పం వెంకటరమణ, ఉపాధ్యక్షుడు పులి శేఖర్, తీపలపూడి రమణయ్య తదితరులు పాల్గొని జయప్రదం చేశారు.
Post a Comment