కేంద్ర పథకాల అమలులో నెల్లూరు జిల్లా టాప్ ఎంపీ ఆదాల ప్రశంస


 

 కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలయ్యే పథకాల్లో నెల్లూరు జిల్లా అగ్రస్థానంలో ఉందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. జిల్లా మౌలిక సదుపాయాల కల్పన సలహామండలి (దిశ) సమావేశం శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన భవన్లో జరిగింది. దీనికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. కలెక్టర్ చక్రధర్ బాబు, మేయర్ పొట్లూరు స్రవంతి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ ఆదాల మాట్లాడుతూ 43 అంశాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాల్సిన ఈ సమావేశం కోవిడ్ కారణంగా గత 6 నెలలుగా జరగలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఆయా పథకాల ద్వారా ఏ మేరకు సద్వినియోగం అయ్యాయి, ఇంకే సమస్యలు ఉన్నాయనే విషయం గా సమీక్షించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనుల్లో కోటి 18 లక్షల పనిదినాలను కల్పించి దేశంలోనే నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. అదేవిధంగా పి.ఎం.ఏ.జి.వై పథకం కింద ఎస్సీ ,ఎస్టీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో జిల్లా రెండో స్థానం సాధించిందని పేర్కొన్నారు. 160 గ్రామాలలో డ్రోన్ ద్వారా సర్వే చేసి జిల్లా దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు. స్వచ్ఛ పర్యవేక్షక ర్యాంకింగ్లో నెల్లూరు నగర పాలక సంస్థ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి 10 కోట్ల రూపాయల నగదు బహుమతిని సాధించడం గర్వించదగిన విషయమని కితాబునిచ్చారు. పీ.ఎం కిసాన్ అమలులో జాతీయ అవార్డు లభించిందని పేర్కొన్నారు. రైతులు రైతు భరోసా మొత్తాలను సకాలంలో అందించడం ద్వారా ఈ అవార్డు దక్కిందని తెలిపారు. కోవిడ్ నివారణ చర్యల్లో కూడా మన జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ లో నెంబర్వన్ స్థానాన్ని సాధించిందని ప్రశంసించారు. వెయ్యి మందికి పైగా ప్లాస్మా చికిత్స అందించామని, కోటి ఎనభై ఐదు వేల మందికి కోవిడ్ చికిత్సను అందించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ లో ఉన్న 25 మంది విద్యార్థుల్లో ఇప్పటికే 11 మంది జిల్లాకు చేరారని, మిగతా వారిని కూడా రప్పించేందుకు జిల్లా కలెక్టర్ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని పనిచేస్తున్నారని తెలిపారు. జిల్లాను పలు పథకాల అమలులో అగ్రస్థానంలో ఉంచిన జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు తన అభినందనలు మనస్ఫూర్తిగా తెలిపారు.డ్వామా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జేసి గణేష్ నాయక్ అధికారులను పర్యవేక్షించారు. ఎంపీ విలేకర్ల సమావేశంలో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, పాముల హరి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, నరసింహారావు , మైపాడు అల్లాబక్షు, మధు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget