35 సంవత్సరముల తర్వాత కోటపోలూరు గ్రామంలో వెలసియున్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ ఖరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కు అందరూ ఆహ్వానితులే... ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు గ్రిద్దట్టి శ్రీధర్ రెడ్డి.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-
మండలంలోని కోటపోలూరు గ్రామంలో వెలసియున్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ ఖరేశ్వరస్వామి దేవస్థానం నందు రేపటినుండి అనగా 16.3. 2022 బుధవారం నుండి 20.3. 2022 ఆదివారం వరకు స్వామివారికి మరియు అమ్మవారికి బ్రహ్మోత్సవాలు గ్రామ పెద్దలు, ఆడపడుచులు, గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ సారధ్యంలో ఘనంగా నిర్వహించనున్నారు.
అనంతరం ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రేపటి నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా గా భక్తులందరూ విచ్చేసి స్వామి వారిని మరియు అమ్మవారిని దర్శించుకుని తీర్ధ, ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షం పొందాలని కోరారు.
ఆలయ వేద పారాయణ పండితులు కాశీభట్ల శరత్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలు 35 సంవత్సరముల తరువాత నిర్వహించడం చాలా సంతోషకరం గా ఉందని ఈ ఆలయంలో పంచాహ్నికంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడునని అన్నారు.
మొదటి రోజు బుధవారం ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ, సాయంత్రం అంకురారోహణ, అగ్ని ప్రతిష్టాపన మరియు రాత్రి ధ్వజారోహణ నిర్వహిస్తానని, రెండో రోజు గురువారం ఉదయం హోమాలు ,అభిషేకం రాత్రి సింహవాహన గ్రామోత్సవం జరుగును మూడో రోజు శుక్రవారం ఉదయం హోమాలు, అభిషేకాలు నిర్వహించి రాత్రి నంది సేవ గ్రామోత్సవం నిర్వహించనున్నారని, నాలుగవ రోజు శనివారం ఉదయం హోమాలు, అభిషేకాలు నిర్వహించి సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణం తలంబ్రాల ఉత్సవము, అశ్వవాహనం పై నిర్వహించనున్నారని, ఆఖరి రోజు ఆదివారం వసంతమాల పూజ, వసంతోత్సవము నిర్వహించి రాత్రికి ధ్వజా వరోహణ, మూకబలితో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, ప్రతిరోజు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు,నాదస్వర కచేరి నిర్వహించబడునని కావున భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చే శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు వజ్జా చంద్రశేఖర్ రెడ్డి, నవులూరు శ్రీనివాస రావు, మొద్దు వెంకటరత్న,పంట్రంగం క్రాంతి కుమారి, బద్దిపూడి మోహన్ రెడ్డి, అల్లూరు రమేష్ రెడ్డి మరియు గ్రామస్తులు ఉన్నారు.
Post a Comment