శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, వరిగొండ పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించి, గ్రామ ప్రజల సమక్షంలో సమీక్ష నిర్వహించి, ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న వైనాన్ని పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
వరిగొండ గ్రామంలో రెండు మంచి నీటి శుద్ధి ప్లాంట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించమన్నా, నా విన్నపాన్ని మన్నించిన, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. తెలుగుదేశం ప్రభుత్వంలో లాగా, జన్మభూమి కమిటీల పేరుతో, అర్హులకు అన్యాయం జరగకుండా, రాజకీయాలకతీతంగా, పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. వరిగొండ లాంటి 16 వేల జనాభా కలిగిన గ్రామంలో, గ్రామస్థుల సమక్షంలో సమీక్ష నిర్వహిస్తే, దాదాపు అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో ఎక్కడన్నా ఒకరు అర్హత కలిగి ఉండి కూడా, ప్రభుత్వ పథకాలు అందకపోతే, అటువంటి వారిని గుర్తించి, అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తాం. తోటపల్లిగూడూరు మండలంలోని గ్రామాలలో 105 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యం కల్పించాం. వరిగొండ గ్రామపంచాయతీ పరిధిలో అధికార పార్టీ శాసనసభ్యునిగా 32 నెలల కాలంలో 7కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సదుపాయం కల్పించాం. గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల పట్టాలు అందించడంతోపాటు, ఇళ్లు మంజూరు చేయించి, ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధులు, జ్వరాల బారిన పడకుండా, పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించవలసిందిగా అధికారులను కోరుతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ప్రతి సమస్యను గుర్తించి, వాటన్నిటినీ పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తాం.
Post a Comment