అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కామాక్షి దేవి శ్రీ ఖరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట:-
మండలపరిధిలో ని కోటపోలూరు గ్రామం లో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి శ్రీ ఖరేశ్వర స్వామి దేవస్థానం బ్రమ్మోత్సవాలు అంగరంగ వైభవముగా ప్రారంభించారు.ఆలయం లో మొదటిగా విగ్నేశ్వర పూజ తో బ్రమ్మోత్సవాలను మొదలుపెట్టారు.నేడు ఉదయం అఖండ స్థాపన ,త్రిసులేశ్వర స్వామి అభిషేకం జరిగింది. సాయంత్రం ధ్వజారోహణ,ఆలయ బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీసిటీ MD రవీంద్ర రెడ్డి సన్నారెడ్డి మొదటిరోజు న ఉభయకర్తలు గా సహకారాన్ని అందజేశారు.కోటపోలూరు గ్రామ పెద్దలు ,ఆడపడుచులు సహకారం తో పాలకవర్గం ధర్మకర్త గ్రిద్దటి శ్రీధర్ రెడ్డి మరియు పాలకవర్గ సభ్యుల సహకారం తో ఈ బ్రమ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు 35 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోస్తవాలకు గ్రామస్తులు, పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని,స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద స్వరగోపురం ఈవెంట్స్ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు .ఈ వేడుకల్లో భాగంగా రేపు (గురువారం) రాత్రి సింహవాహన గ్రామోత్సవం అంగరంగ వైభవముగా నిర్వహించనున్నారు.
Post a Comment