శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరుజిల్లా.సూళ్లూరుపేట : పట్టణంలో నేడు సూళ్లూరుపేట పౌర సమాఖ్య రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఉదయకుమార్ మాట్లాడుతూ సూళ్ళూరుపేట మున్సిపాలిటీ అధికారులు ఇంటి పన్నుల పెంపు పై ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రకటన లేకుండా కొత్త పన్ను విధానమైన స్థిరాస్థిపన్నును అమలు పరిచారన్నారు. ప్రస్తుతానికి స్థిరాస్తి 0.15 శాతముగావున్నా, ప్రభుత్వ గజెట్ ప్రకారము రిజిస్రేషను మరియు స్టాంపుడ్యూటీకి ముడిపడి వున్నందువల్ల భవిష్యత్తులో అది విపరీతంగా పెరగడము ఖాయమన్నారు. అనంతరం రామమూర్తి మాట్లాడుతూ మున్సిపాలిటిలో ఇప్పటివరకు రోడ్లు వేయడము గాని, మురికి కాలువల నిర్వహణ మరెలాంటి ఎలాంటి అభివ్రుద్ది పనులు చేపట్టకుండా పన్ను విషయములో మాత్రము ఆగమేఘాల మీద నోటీసు ఇస్తున్నారన్నారని ఎద్దేవాచేశారు. ఈ సమావేశ సంధానకర్త సాంబశివయ్య మాట్లాడుతూ పన్నులు పెంచితేనే కేంద్ర ప్రభుత్వము అదనపు ఋణం ఇచ్చే కండిషన్ పెట్టిందని గుర్తు చేసారు. పన్నులు చెల్లించే వారు విధి విధిగా తమ అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. కొత్తపన్ను విధానాన్ని ఖండిస్తూ ఈ మోస పూరిత విధానాన్ని ప్రజలకు విస్త్రుంగా ప్రచారము చేస్తామన్నారు. ఈ మీటింగులో బాలు, వివేకం, పుల్లయ్య, శంకరయ్య ,వెంకటేశ్వర్లు, పొన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Post a Comment