నెల్లూరు జిల్లా..చిల్లకూరు మండలం
ప్రమాద స్థలానికి చేరుకున్న గూడూరు రూరల్ CI శ్రీనివాసులు రెడ్డి, చిల్లకూరు ఎస్సై సుధాకర్ రెడ్డి
రోడ్డు ప్రమాదం సమాచారం తెలుసుకున్న గూడూర్ రూరల్ సిఐ శ్రీనివాసులు రెడ్డి, చిల్లకూరు ఎస్సై సుధాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఈ సంఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకునే పనిలో వున్నారు...
సిఐ శ్రీనివాసులు రెడ్డి సేకరించి తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఆటో లోని వారు షాప్స్ కి సరుకులు (ఏరియల్ డిటర్జెంట్) సరఫరా చేస్తూ కోట నుండి చింతవరం వచ్చి అక్కడ నుండి గూడూరు వైపు వస్తున్న క్రమంలో చేడిమాల పెట్రోల్ బంకు సమీపంలోకి వచ్చేసరికి వరగలి క్రాస్ రోడ్ నుండి చింతవరం వైపు వస్తున్న లారీ ఆటో ని ఢీ కొట్టి సుమారు 20 మీటర్ల వరకు ఈడ్చుకుని వెళ్ళడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మరణించినట్టు, ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పరారైనట్టు, లారీ చిల్లకూరు మండలానికి సంబంధించిన ఒక గ్రామం లోని వ్యక్తిదని లారీ యజమానిని పిలిపించి లారీ డ్రైవర్ వివరాలు సేకరించి అతని మీద కేసు బుక్ చేసి పూర్తి విచారణ చేపడతామని మృతుల వివరాలు పూర్తిగా ఇంకా తెలియరాలేదని ఇది ప్రాథమిక సమాచారం అని సిఐ శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు...
రాబడిన సమాచారం మేరకు
మృతులు హరి సాయి,రాజశేఖర్,సుధాకర్ గా గుర్తింపు...
హరిసాయి,రాజశేఖర్ ది గూడూరు మండలం చెన్నూరు గ్రామం అయినట్టు వీరి వయసు 27 నుండి 30 సమవత్సరాలు లోపు ఉండొచ్చు,,.. సుధాకర్ ది గూడూరు పట్టణం అని సమాచారం..
Post a Comment