కేంద్ర బడ్జెట్ కార్పోరేట్లకు అనుకూలంగా ఉంది

 కేంద్ర బడ్జెట్ కార్పోరేట్లకు అనుకూలంగా ఉంది

- సిపిఐ నాయకులు దామా అంకయ్య, డేగా సత్యం వెల్లడి




కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని, సామాన్య జనానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని  కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నదని సిపిఐ జిల్లా సమితి సహాయ కార్యదర్శి దామా అంకయ్య విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నెల్లూరు జిల్లా సమితి సహాయ కార్యదర్శి దామా అంకయ్య, కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏ ఒక్క రంగానికీ మేలు చేసే విధంగా లేదని దుయ్యబట్టారు. గతంలో ఉన్న కేటాయింపుల కంటే ప్రస్తుతం తగ్గించారని తెలిపారు. కార్పొరేట్లకు దోచిపెట్టేవిధంగా బడ్జెట్ ఉన్నదని తెలిపారు. అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రధాని మోడీ, అధికారంలోకి వచ్చిన తరువాత 1,85, 000 మంది ఉద్యోగులు తమ  ఉద్యోగాలను  కోల్పోయారన్నారు. ఈ బడ్జెట్ లో పారిశ్రామిక ఉత్పత్తులకు, వ్యవసాయ రంగ ఉత్పత్తులకు, చిన్న, మధ్య తరహా వాటికి కేటాయింపులు సరిగా జరగలేదన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పోలవరం, ప్రత్యేక హోదా ఊసే లేదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కంటే 25,000కోట్లు  తగ్గించారన్నారు. దీని వలన గ్రామ స్థాయిలో పనులు లేని కారణంగా కొనుగోలు శక్తి పడిపోతుందన్నారు. ఏ దేశంలో నైనా కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని తెలిపారు. గత సంవత్సరం రూ.7,45,000 కోట్ల రుణానికి వడ్డీ చెల్లిస్తే ఈ సంవత్సరం రూ.9,20,000 కోట్ల రుణానికి వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారంటే దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందో, తిరోగమనం వైపు పయనిస్తుందో అర్ధం చేసుకోవాలన్నారు. లాభాల బాటలో ఉండే ఎల్ ఐసీ ని అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తున్నామన్నారు. కరోనా సమయంలో సామాన్య ప్రజలకు ఎలాంటి సహాయం చేయలేదని, కార్పొరేట్లకు మాత్రం పెద్ద ఎత్తున సహాయం చేయడం జరిగిందన్నారు. గతంలో 93 మంది కార్పోరేట్లు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 141కి పెరిగిందన్నారు. లక్షల కోట్లు కార్పోరేట్లకు తరలించే విధంగా ఉన్న ఇలాంటి తప్పుడు, ప్రజా వ్యతిరేఖ బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు దమ్ము దర్గాబాబు, సిపిఐ నాయకులు పసుపులేటి మహేష్, బోస్, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget