చెంగాళ్ళమ్మ ఆలయంలో రాజగోపురంకు బంగారు తాపడం పనులను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడి దంపతులు.
నెల్లూరుజిల్లా.సూళ్లూరుపేట : కాల్లంగి నదిఒడ్డున వెలసివున్న భక్తుల కొంగుబంగారం శ్రీ చెంగాళ్ళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో రాజగోపురం కు బంగారు తాపడం పనులకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి సతీమణి టీటీడీ బోర్డ్ మెంబర్ శ్రీమతి ప్రశాంతి నేడు ప్రారంభించారు .
ఈ బంగారు తాపడం కార్యక్రమం ఆలయ చైర్మన్ దువ్వూరు. బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో, ఆలయ కార్యనిర్వాహక అధికారి ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి పర్యావేక్షణలో ఈమహోన్నత కార్యక్రమం చేపట్టారు.ఈకార్యక్రమానికి సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డీ, పట్టణ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమండలి డైరెక్టర్ శ్రీ కళత్తూరు శేఖర్ రెడ్డీ, మాజీ బోర్డ్ మెంబర్ గోగుల తిరుపాల్ పూజలో పాల్గొన్నారు.
గుడి గోపురం మొత్తం పూర్తిగా బంగారం తాపడానికి దాతలుగా వైఎస్సార్ సిపి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కావడం విశేషం. ఈ బంగారు తాపడాన్ని కళాకారులు ఆరు నెలలు లోపల పనులు పూర్తి చేయన్నున్నారు. బంగారు గోపురం పనులు పూర్తి అయినా వెంటనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేయనున్నటు
ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి తెలియజేసారు.
Post a Comment