చెంగాళమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ పిన్నెలి రామకృష్ణా రెడ్డి దంపతులు.
నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట : కాల్లంగి నదిఒడ్డున వెలసివున్న తెలుగు, తమిళ ఆరాధ్యదైవం, భక్తుల కొంగుబంగారం శ్రీ చెంగాళమ్మ తల్లిని శనివారం మాచర్ల శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ పిన్నెలి రామకృష్ణ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొన్నారు. వారిని ఆలయ ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో శాలువాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమములో సూళ్ళూరుపేట MPP అల్లూరు అనిల్ రెడ్డి, కళత్తూరు శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ చిన్నిసత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు ముంగుర శేషారెడ్డి, మీజూరు రామకృష్ణ రెడ్డి వైయస్.ఆర్.సి.పి నాయకులు జెట్టి వేణు యాదవ్ ఓడూరు రమణా రెడ్డి, ముప్పాళ చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment