రాష్ట్రం లో మహిళలకు రక్షణ కరువైంది రాష్ట్ర టీడీపీ మహిళలు కమిటీ సభ్యులు ఆరోపణ.

 రాష్ట్రం లో మహిళలకు రక్షణ కరువైంది రాష్ట్ర టీడీపీ మహిళలు కమిటీ సభ్యులు ఆరోపణ.



 

నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట  : రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైoదని టిడిపి మహిళా నాయకురాళ్ళు ఆరోపించారు. ఈ నెల 24 న నెల్లూరు లో జరిగే నారి సంకల్ప దీక్ష ను పురస్కరించుకొని నేడు సూళ్లూరుపేట టిడిపి  కార్యాలయం లో జరిగిన విలేకర్ల సమావేశం లో టిడిపి  రాష్ట్ర మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి  ముప్పాళ్ల విజేత,ఉపాధ్యక్షురాలు శ్రీదేవి చౌదరి పాల్గొన్నారు.  ఈ సందర్భముగా  ముప్పాళ్ళ విజేత మాట్లాడుతూ  మూడేళ్ళ వైసీపీ పాలనలో మహిళల పై జరుగుతున్న అగాయిత్యాలు,అరాచకాలు ను గురించి ప్రజలకు  తెలియజేయడం కోసమే నారి సంకల్ప దీక్ష ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి  కొనలేక, తినలేక పస్తులతో పేదలు ప్రశాంతతను కోల్పోయారని,వాటిపై ప్రశ్నించే వారిపైన దౌర్జన్యాలు  చేయడం , కేసులు పెట్టడం భయబ్రాంతులకు గురిచేయడం  జగన్ రెడ్డి పాలనలో సర్వసాధారముగా మారిందని  వీటికి చరమగీతం పాడి తిరిగి టీడీపీ ని గెలిపించి చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేసేవరకు ఈ నారి సంకల్ప దీక్ష  ఆగదని ఆమె తెలియజేసారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి చౌదరి మాట్లాడుతూ వైఎస్సార్ సిపి పాలనలో దిశా  చట్టం దిక్కులేనిదైందని ,మద్యపాన నిషేధం మరుగునపడిందని,అమ్మవొడికి ఇప్పుడు కుంటి  సాకులు జోడిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశం లో టిడిపి కౌన్సిలర్ ఈదూరు చెంగమ్మ,  మాజీ కౌన్సిలర్లు బుద్ది విజయలక్ష్మి, సాయి చందన,మేడా అమరజ్యోతి, మంజుల,రాజి,సరితా తదితరులు  పాల్గొన్నారు.ఈ సమావేశం నిర్వహణకు టిడిపి తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి  సతీష్ రెడ్డి సహకారాన్ని అందజేసి మద్దతు పలికారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget