వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక పేదవారు పండుగలు చేసుకునే స్థితిలో లేరు..
టీడీపీ హయాంలో పేదవారికి పండుగ కానుకలు ఇచ్చేవారు..
మంత్రి అనీల్....రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భూకబ్జాలే అజెండా గా ఉన్నారు...
మంత్రి అనీల్.... శ్రీధర్ రెడ్డి రాజకీయ ఆలోచనలు మానేసి ప్రజలను మోసం చేయకుండా, వారికి మంచి చేయండి....
నాడు బురద లో దిగిన శ్రీధర్ రెడ్డి నేడు ఎక్కడికి వెళ్ళాడు...
నెల్లూరు రూరల్ లో రోడ్ లు, కాలువ లు పూర్తి కావాలంటే శ్రీధర్ రెడ్డి నీ తెచ్చి కాలువలో పొల్లాడించండి..
అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి...
నెల్లూరు నగరంలోని స్థానిక 29 వ డివిజన్ లోని గాంధీ నగర్, సుభాష్ చంద్ర బోస్ నగర్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గంగాధర్, చెంచయ్య, అస్లామ్, కృష్ణా ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు నెల్లూరు పార్లమెంట్ టీడీపి అద్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జీ అబ్దుల్ అజీజ్ ఆదివారం బహుమతి ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి కనపర్తి గంగాధర్ సభా అధ్యక్షత వహించారు...కరోనా తీవ్రత వల్ల దాదాపు మూడు సంవత్సరాల నుంచి పండుగ వాతావరణాన్ని మర్చిపోయానని, అయితే పండుగ వాతావరణం ఉండాలని ముగ్గులు పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.కులమతాలకతీతంగా 54 మంది ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారని ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ముగ్గురు వేశారని అయితే అందులో మూడు ముగ్గులను విజేతలుగా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.సంక్రాంతి తర్వాత కరోనా తీవ్రత పెరగడం వలన బహుమతి ప్రధానానికి ఆలస్యమైందని వివరించారు.మనం పట్టణాల్లో ఇరుగుపొరుగు ఎవరో కూడా తెలియకుండా నివశిస్తున్నామని, ఇరుగుపొరుగు వారితో ప్రేమ ఆప్యాయతలతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు...వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం ప్రజల పండుగలు చేసుకునే పరిస్థితిలో లేరని, నిత్యావసర సరుకుల దగ్గర్నుంచి ప్రతి ఒక్కటి అధిక ధరలు పెంచేసి పేద ప్రజలపై గుదిబండ మోపుతున్నారని అన్నారు.టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడు పండుగ చేసుకోవాలని ఆలోచనలతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పేద ప్రజలకు పండుగ కానుక ఇచ్చేవారని గుర్తు చేశారు.కృత్రిమ ఇసుక కొరత సృష్టించి, అనేక వర్గాల కార్మికులను రోడ్డు పాలు చేశారని, అక్రమ ఇసుక తరలింపు చేసి కార్మికులకు రెండు సంవత్సరాలుగా చూపిస్తున్నారని అన్నారు..మంత్రి అనిల్... రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, భూకబ్జాల ఆలోచనలు, రాజకీయ లెక్కల మానుకొని ప్రజలకు మంచి చేయాలి హితవు పలికారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు ప్రజలకు మంచి చేయాలని టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు... ఇద్దరు నాయకులు రాజకీయ లెక్కలు మానుకుని, ప్రజలను మోసం చేయకుండా ప్రజలకు ఉపయోగపడాలన్నారు...పై కార్యక్రమంలో పనబాక భూ లక్ష్మి ,జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్,రేవతి, వనజా రెడ్డి, మస్తాన్ బి, కనపర్తి వనజ, శ్రీహరి, నస్రీన్, అశ్లామ్, అబ్దుల్లా, ఖదీర్, సల్మాన్, మాజీడ్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment