గూడూరు జిల్లా కోసం కదంతొక్కిన తెలుగుతమ్ముళ్లు

"గూడూరు" ను జిల్లాగా ప్రకటించాలి- లేదా నెల్లూరు జిల్లాలో ఉంచాలి 





రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేసిన గూడూరు ప్రజానీకం 

గూడూరులో కదంతొక్కిన టీడీపీ- ప్రతిపక్ష పార్టీలు 

పట్టణంలో భారీ ర్యాలీ- తరలి వచ్చిన జన సమూహం 

ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయింపు- మోకాలపై నిరసన 

గూడూరు  ప్రజల మనోభావాలు గౌరవించాలి:పాశం 

గూడూరు ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటం 

టీడీపీ, ప్రతిపక్ష పార్టీలు హెచ్చరికలు 


 గూడూరు నియోజకవర్గ ప్రజల మనోభావాలు రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వెంటనే గూడూరు ను జిల్లా గా ప్రకటించడం లేదా యధావిధిగా నెల్లూరు జిల్లాలో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు.మంగళవారంగూడూరు నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ గూడూరును జిల్లాగా ప్రకటించాలి, లేకపోతే నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలనికోరుతూ మంగళవారం గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టిడిపినాయకులు ,కార్యకర్తలు,ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో కలసి పట్టణంలోని గమళ్ల పాళెం లో ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయం నుండి క్రిష్ణ మందిరం, రాజావీధి, టవర్ క్లాక్ సెంటర్ మీదుగా భారీ ర్యాలి గా నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకొని బైఠాయించి నిరసన తెలిపారు.  అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట మోకాళ్ళ పై నిరసన వ్యక్తం చేసి ఆర్డీవో కార్యాలయం ఏ వో కు మాజీ శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా పాశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం అనే పేరుతో జనవరి26 గణతంత్ర దినోత్సవం నాడురాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ రాజ పత్రం(గెజిట్ నోటిఫికేషన్) విడుదల చేయడం జరిగింది అని తెలిపారు.తిరుపతి జిల్లా కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాను ఏర్పాటు చేసి దానిలో తిరుపతి, చంద్రగిరి, శ్రీ కాళహస్త్రి, సత్యవేడు, సుళ్ళూరుపేట, వెంకటగిరి నియోజకవర్గలతో పాటు గూడూరు నియోజక వర్గాలను కలపడం జరిగింది అని తెలిపారు.  అయితేగూడూరు నియోజకవర్గం  ప్రస్తుతం నెల్లూరు జిల్లా కేంద్రంగా నెల్లూరు జిల్లాలో ఉందిఅని,గూడూరు-నెల్లూరు 36 కి.మీ దూరంతో 45 నిమిషాల ప్రయాణంతో గూడూరు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంది అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గూడూరు ను శ్రీ బాలాజీ జిల్లాలో కలిపితే జిల్లా కేంద్రమైన తిరుపతి 100 కి.మీ  దూరం ఉంటుంది.అది గూడూరు నియోజకవర్గ ప్రజలకు సౌకర్యవంతం కాదు అని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంచినపుడు, ప్రజలకు అది సౌకర్యవంతంగా ఉండదో లేదో ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి అని హితవుపలికారు.  కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గూడూరు నియోజకవర్గ ప్రజలు అన్ని విధాలుగా కూడా నష్టపోతున్నారుఅని ఆగ్రహంవ్యక్తంచేశారు.నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు కూడా ఆలోచించాలి, ఎంతో చరిత్ర కలిగిన  గూడూరును, బాలాజీ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ, ముఖ్యమంత్రికి  గూడూరును జిల్లాగా చేయాలని, లేకపోతే నెల్లూరు జిల్లాలోనే ఉంచేలా గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు ద్వారా విన్నవించాలనికోరుతున్నట్లు వెల్లడించారు.  రాష్ట్ర ప్రభుత్వం పునరలోచన చేసి   శ్రీ బాలాజీ జిల్లాలో గూడూరు ను తొలగించాలి లేకపోతే గూడూరు జిల్లా కేంద్రంగా చేసి సూళ్ళూరుపేట, వెంకటగిరి ,సర్వేపల్లి నియోజకవర్గాలలోని 22 మండలాలు ఒక గ్రేడ్ -1 మునిసిపాలిటి మరియు 3 మునిసిపాలిటిలను కలిపి ఒక జిల్లా గా ప్రకటించాలని కోరుతున్నాము అని డిమాండ్ చేశారు. అలా వీలుగాని పరిస్థితులలో గూడూరు ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం కోరారు.  ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బిల్లు చెంచు రామయ్య,వెంకటేశ్వరరాజు,పులిమిశ్రీనివాసులు,ఇజ్రాయెల్ కుమార్, మట్టం శ్రావణి, పల్లె   కోటేశ్వరరావు, భారతి, షేక్ జలీల్ అహ్మద్, నెల్లబల్లి బాస్కర్ రెడ్డి,మధురెడ్డి,టీడీపీ రాష్ట్ర,పార్లమెంట్,నియోజకవర్గ,పట్టణ,మండల,వార్డుగ్రామ,అనుబంధ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget