శ్రమ దోపిడీపై పోరాడితేనే సమసమాజస్థాపన. -----సిపిఎం
కమ్యూనిస్ట్ ప్రణాళిక తాజా ప్రతులను ఆవిష్కరిస్తున్న సిపిఎం సీనియర్ నాయకులు.
కావలి -తే.20-2-2022.ది దేశంలోని పెట్టుబడిదారుల వద్ద పోగుపడి ఉన్న (శ్రమదోపిడీ ) సంపద సమాజంలోఅసమానతలకుమూలమని,కార్మిక వర్గ నాయకత్వంలోశ్రమదోపిడీనిఅంతంచేసి,సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పసుపులేటి పెంచలయ్య, పార్టీ సీనియర్ నాయకులు శ్రీకర్ల వెంకయ్య, వల్లభుని మల్లికార్జునరావులు పిలుపునిచ్చారు. ఆది వారం స్థానిక వెలగా శివరామ సుబ్బయ్య భవన్ (సిపిఎం కార్యాలయం)లో "రెడ్,బుక్,డే"నునిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 172 సంవత్సరాలకి ముందే "కమ్యూనిస్టు ప్రణాళిక " నుకమ్యూనిస్ట్,సిద్ధాంతకర్తలైన కారల్ మార్క్స్,ఫెడరిక్ ఎంగేల్స్,లురచించారనితెలిపారు.ఈ మానిఫెస్టోలో ఆనాడు పేర్కొన్న బూర్జువా, భూస్వామ్య, పెట్టుబడిదారి విధానాలు, వాటిద్వారా కార్మిక వర్గస్థాపనకు నాంది పలికిందన్నారు. కార్మిక వర్గాపోరాటానికి వీరు ఆనాడే 'కమ్యూనిస్ట్ మేనిఫెస్టో'ను ఆయుదంగా అందజేశారని తెలిపారు. ఈ అమూల్యమైన పుస్తకాన్ని, ప్రతి ఒక్కరూ చదివి,దీని సారాంశాన్ని విస్తరంగా కార్మిక వర్గంలోకి తీసుకు వెళ్లాలని సిపిఎం కేంద్రకమిటీ పిలుపునిచ్చిందనిపేర్కొన్నారు.ప్రస్తుత ప్రపంచంలో అమలు అవుతున్న ప్రైవేటికరణ, ఆర్ధిక, సరళీకరణ విధానాలను ప్రతి కామ్రేడ్ అర్ధం చేసుకోవాలన్నారు. దేశంలో మతోన్మాద ముసుగులో కేంద్ర బిజెపి కూటమి కార్పొరేట్ దోపిడీని తీవ్ర తరం చేస్తూ, ప్రభుత్వరంగ సంస్థలు అన్నింటిని ప్రైవేటికరణకు సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రభుత్వ కుటిల చర్యలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఏకం చేసి కార్మికవర్గ నాయకత్వాన పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందన్నారు. ఈ సందర్బంగా వారు కమ్యూనిస్ట్ ప్రణాళిక, కమ్యూనిస్ట్,మూలసూత్రాలు కలిపి ప్రచురించిన పుస్తకాలనుఆవిష్కరించారు. ఈ" రెడ్ బుక్ డే "సమావేశంలో సిపిఎం నాయకులు పెంచల నరసింహ, కె. జాన్, రవి, శర్మ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post a Comment