నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట : సూళ్లూరుపేట లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అద్వర్యం లో ఆందోళన చేపట్టారు. తమిళనాడులోని తంజావూరులో మతమార్పిడి కోసం ఒత్తిడి తెచ్చి లావణ్య అనే యువతి ఆత్మహత్య కు కారణమైన మిషనరీ సంస్థ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ధర్నా,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. లావణ్య కుటుంబానికి న్యాయం చేయాలనీ విద్యార్థులు డిమాండు చేసారు. ఈ నిరసన కార్యక్రమం లో ఎబివిపి నగర సంయుక్త కార్యదర్శి కే.చందన,ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సన్నీ ,నగర కార్యదర్శి వెంకటేష్, నగర ఉపాధ్యక్షురాలు లీలావతి,జగదీష్,బాలాజీ, హర్షిత్,క్రాంతి,జీవన్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment