నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవు - ఎస్ ఐ . పి . రవి బాబు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట:-
పట్టణంలో కరోనా కట్టడి నేపద్యంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ. పి రవి బాబు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక మద్యం దుకాణాల ప్రక్కనే కూల్ డ్రింక్స్ దుకాణాల వద్ద మద్యం సేవిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపడతామని దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులు, మాస్కులు ధరించని వారికి, వాహనదారులకు ముందస్తు అవగాహనను కల్పిస్తూ ఖచ్చితంగా మాస్కలు ధరించి సోషల్ డిస్టన్స్ పాటించాలని అలా పాటించని వారిపై జరిమానాలు రూపంలో వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆదివారం పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో తమ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
పట్టణ వీధుల్లో మితిమీరిన వేగంతో రాష్ డ్రైవింగ్ లకు, ఈవ్ టీజింగ్ లు చేసిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా నడుచుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామీణ, పట్టణ ప్రజలు అందరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు
Post a Comment