ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మెరుగైన సేవలు:- ఎ డి ఎ రాజ్ కుమార్.
నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట : పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో రైస్ మిల్లుల యజమానులకు, ధాన్యం కొనుగోలు సిబ్బందికి నేడు ADA రాజ్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సులూరుపేట ఏ డి ఏ రాజ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఎవరైతే రైతులు అమ్ముకుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్ బి కె సిబ్బంది, రైస్ మిల్లుల యజమానులు చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బి పి టి 52 0 4, ఆర్ ఎన్ ఆర్ 15 0 48 రకాల ధాన్యం అధిక ధరలకు బయట మార్కెట్లో రైతులు అమ్ముకుంటున్నారని, అయితే NLR 34 44 9 రకాల ధాన్యం రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముతున్నారని కాబట్టి నెల్లూరు జిలకర్లు సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో గాని, రైస్ మిల్ లో గాని రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని, వ్యవసాయ అధికారులు, రైసుమిల్లు యజమానులు కొనుగోలు లో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై డి టి రాజేంద్ర, సూళ్లూరుపేట ,తడ, దొరవారిసత్రం మండలాల MAO లు కవిత, కాంచన, జ్యోతిర్మయి మరియు VAA లు, తొమ్మిది మంది రైస్ మిల్లుల యజమానులు మరియు రైతులు పాల్గొన్నారు.
Post a Comment