పరిస్థితులు బాగుంటే మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని: ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌

 పరిస్థితులు బాగుంటే మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని: ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. 


మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో ఆదివారం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇంత మేలు చేసినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. 

ఉద్యోగ సంఘాలతో సీఎం

ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను  ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు   కాని ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశాం  రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది

►రాజకీయాలకు తావు ఉండకూడదు

►ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్‌ కమిటీకూడా ఉంది

►ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు

►ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుంది

►ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చు

►ప్రభుత్వం అంటే ఉద్యోగులది

►అంత దూరం పోవాల్సిన అసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చు

►ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి

►నిన్న మంత్రుల కమిటీ నాతో టచ్‌లోనే ఉంది

►నా ఆమోదంతోనే వీటన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది

►ఐ.ఆర్‌. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్‌ను. సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400కోట్లు భారం పడుతోంది

►హెచ్‌.ఆర్‌.ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది

►అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్‌ వ్యయం రూపేణా హెచ్‌.ఆర్‌.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోంది.

►మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోంది. ఆర్థికంగా పడే భారం ఇది

►మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నాను

►రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం

►ఈ పరిస్థితులు ఈ మాదిరిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని

►దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి

►మినిమం టైం స్కేలు వర్తింపు చేశాం, అన్నిరకాలుగా ఆయా జీతాలు పెంచాం

►ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్చలు జరిగాయి

►మీరు లేకపోతే నేను లేను. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నాను. ఇది మీ వల్లే సాధ్యపడుతోంది

►భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే.. మీరు చెప్పుకోండి

►రాబోయే రోజుల్లో సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నాం

►అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నాం

►వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటాను

►ఇవాళ మీరు కొత్తపద్దతిలోతీసుకుంటున్న పెన్షన్‌ మంచిగా పెరిగేలా చూస్తాను

►ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్‌ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్‌ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నాం

►భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నాం

►అందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను

►కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాను

►30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం

►సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం

►అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం

►ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం

►దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం

►24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశాం

►అలాగే ఇళ్లస్థలాల విషయంలోకూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం

►ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం

►మీరు చెప్పేవి వినడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget